శ్రీనగర్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుళ్ళ ముళ్ళ గ్రామంలో ఖీర్ భవాని టెంపుల్ ఉంది. చుట్టూ ఉన్న చినార్ చెట్లు అలాగే అందమైన ప్రవాహాలు ఈ ఆలయ అందాలని పెంచుతాయి. భారతీయ తీపి వంటకమైన ఖీర్ మరియు పాలు మాత్రమే నైవేద్యంగా భక్తులచే సమర్పించడం వల్ల ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది. 1912 వ సంవత్సరంలో రగ్న్య దేవి కోసం ఈ కోవెల మహారాజా ప్రతాప్ సింగ్ చే నిర్మింపబడింది. ఆ తరువాత మహారాజా హరి సింగ్ చే ఈ ఆలయం పునర్నిర్మితమయింది.
ఈ ఆలయం లో ఉన్న షట్కోణపు కొలను అమ్మవారికి ప్రతినిధి అని నమ్మకం.హిందువుల దైవం అయిన రాముడు ఈ ప్రాంతాన్ని పూజకి ఉపయోగించుకునేవారని పురాణ గాధలు చెబుతున్నాయి. బహిష్కరణ కాలం అయిపోయిన వెంటనే అమ్మవారి విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న షాదీపుర కి తరలించమని హనుమంతుల వారిని అడిగారు.
దుర్దశలను సూచించేటప్పుడు నైవేద్యంగా ఇవ్వబడిన తెల్లని ఖీర్ నలుపు రంగులోకి మారుతుందని భక్తుల నమ్మకం. మే నెలలో పౌర్ణమి తరువాత ఎనిమిదవ రోజు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు జరుపుతారు. ఈ పవిత్రకరమైన రోజున నీటి రంగుని అమ్మవారు మారుస్తారని భక్తుల నమ్మకం. జేష్ఠ అష్టమి అలాగే శుక్ల పక్ష అష్టమి వంటివి ఈ ఆలయం లో నిర్వహింపబడే ముఖ్యమైన పండుగలు.



Click it and Unblock the Notifications