ఉత్తమ సమయం కథువా పట్టణ పర్యటనకు వేసవి కాలం ఉత్తమమైనది. ఈ సమయం లో పర్యాటకులు సైట్ సీఇంగ్, ట్రెక్కింగ్ వంటి అవుట్ డోర్ చర్యలు కూడా ఆచరించ వచ్చు.
వేసవులు వేసవి కాలం ఏప్రిల్ లో మొదలై జూన్ చివరి వరకూ వుంటుంది. వేడిగా నులి వెచ్చగా వుంటుంది. గరిష్టం 47 డిగ్రీలుగాను కనిష్టం 24 డిగ్రీలు గాను వుంటుంది. ఈ సమయంలో పర్యాటకులు ట్రెక్కింగ్, సైట్ సీఇంగ్ వంటివి ఆనందించవచ్చు.
వర్షాకాలం వర్షాకాలం జూలైలో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ ప్రాంతం ఒక మోస్తరు వర్షాలను పొందుతుంది. అయితే, కథువా కొండ ప్రాంతాలలో టవున్ లో కంటే అధిక వర్షం పడుతుంది.
శీతాకాలం కథువా లో వింటర్ సీజన్ అక్టోబర్ లో మొదలై జనవరి వరకూ కొనసాగుతుంది. చాలా చలిగా వుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలుగా వుండగా, గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదవుతుంది. ప్రదేశ సందర్శనకు ఈ సమయం సూచించ దగినది కాదు.