దేవబంధు దేవాలయం నది ఒడ్డున మూడు వైపులా నీటితో అద్భుతంగా కనపడుతూంటుంది. ఇది ఖొడాలకు సమీపంలో ఒక చిన్న గ్రామంలో గంభీరమైన సహ్యాద్రి కొండలలో కలదు. ఇది కేర్వాడిలోని మౌంటెన్ రేంజ్ వైల్డ్ కేంప్ సమీపంలో కలదు. దేవ బంధు దేవాలయం లో గణేశుడి విగ్రహం కలదు. గణేశ ఉత్సవాలు, వినాయక చవితి మొదలైన పండుగలకు భక్తులు ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో వస్తారు. పర్వత ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో కల ఈ దేవాలయం ధ్యానానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ఒక వినోద విహార ప్రదేవంగా కూడా ఉంటుంది. వెనుక భాగంలో దేవ బంధు జలపాతాలను కూడా దర్శించవచ్చు.



Click it and Unblock the Notifications