చరంగ్ ఘటి 'సాంగ్ల వాలి'లో ఉన్నది. దీని ఎత్తు 5242 మీ. మరియు ఇది చిట్కుల్ గ్రామంలో ట్రెక్కింగ్ కి ఆధారంగా ఉన్నది. దీనిని 1994వ సంవత్సరంలో పర్యాటకుల సందర్శనార్ధం ప్రారంభించారు. అప్పటినుండి ఈ ప్రాంతం ట్రెక్కింగ్ స్థలంగా, 'చరంగ్ ఘటి పాస్' గా పేరు వొచ్చింది. అధిరోహణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు దీనియొక్క సహజమైన అందాన్ని, అక్కడ ఉన్న స్థానిక దేవాలయాల అందాన్ని చూసి సంతోషిస్తుంటారు. ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలు చరంగ్ ఘటిని సందర్శించటానికి సరి అయిన సమయంగా పరిగణిస్తారు. ఇక్కడ జూలై నెల మధ్య వరకు కూడా ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది.



Click it and Unblock the Notifications