Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొక్కెరే బెల్లూర్

కొక్కెరే బెల్లూర్ - పక్షి సందర్శకుల ప్యారడైజ్

12

ఈ పక్షి ఆభయారణ్యం సందర్శనకు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహ పడుతూంటారు. వివిధ రకాల పక్షులని చూసి ఆనందిస్తారు. ఈ అభయారణ్యంలో నడుస్తూ పక్షుల కిలకిలారావాలను విని ఆనందిస్తారు. ఈ అభయారణ్యాలు వాటికి సురక్ష్టిత నివాస స్థానాలు. కనుక మనం వీటిని నియమిత గంటల కాలంలోనే చూడాలి. అక్కడ మీరు చెల్లించే ప్రవేశ రుసుము ఎంతో తక్కువ కాని వాటి సాంగత్యం లో మీరు ఏంటో ఆనందం పొందుతారు.

ఈ రకంగా పక్షులు మనుషులతో ఎంతో సన్నిహితంగా మెలిగే అందమైన ప్రదేశాలలో కొక్కేబెల్లూర్ ప్రదేశం ఒకటి. ఈ చిన్న గ్రామం మండ్య జిల్లాలో బెంగుళూరు మైసూరు రహదారిలో కలదు. ప్రశాంత వాతావరణం మరియు పక్షి సందర్సన కోరుకునే వారికీ ఇది ఎంతో చక్కని ప్రదేశం.

అన్ని పక్షి అభయారణ్యంలవలె కాక ఈ ప్రదేశం ఒక చిన్న గ్రామంగా వుంటుంది. ఇక్కడ పెలికాన్లు వాటి నివాసం ఏర్పరచుకున్నవి. ఈ గ్రామంలోని నివాసితులు వాటిని ఎంతో జాగ్రత్త గ చూచుకుంటారు. అవి వారి చర్యలకు ప్రతిస్పందనను అందిస్తాయి. ఈ పెలికాన్లని కన్నడ భాషలో కొక్కేరాలు అంటారు. కనుక, వాటి పేరుపై ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది.

సరైన సమయంలో కనుక మీరు అక్కడ ఉంటె వాటిని గుంపులుగా చూచి మీరు ఆనందిస్తారు.

కొక్కేరే బెల్లురు సందర్శనకు నవంబర్ నుండి జూన్ వరకు బాగుంటుంది. ఈ సమయంలో సుమారు 1000 పెలికాన్ల నుండి 2500 వరకు చూడవచ్చు.

ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశం కాక పోయినప్పటికీ పర్యాటకులు ఫిబ్రవరి , మార్చి నెలలలో అధికంగా వస్తారు. పక్షులకు, మనుషులకు ఇక్కడ మంచి సాంగత్యం ఉండటంతో ఇక్కడి నివాసితులు వాటికి చక్కని ఆహరాలనందిస్తూ వారి గ్రామానికి అవి గర్వకారణంగా భావిస్తారు.

ఒక పక్షి సందర్సకుని మాటలు పరిశీలిస్తే " ఈ గ్రామాన్ని నేను సుమారు 1994 నుండి పరిశీలిస్తున్నాను. ఇక్కడ వీటికి చక్కని సంరక్షణ లభిస్తోంది. ఈ గ్రామం గతంలో కంటే దేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచింది. అయితే మా భయమల్లా సందర్శకులనుండే.  వాటికి  కొన్నిమార్లు ఎంతో హాని తలపెడతారు. దానితో అవి అక్కడనుండి వేరే ప్రదేశాలకు ఎగిరి  వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. వాటి గుడ్లు వేరే పక్షులు ఎగరేసుకు పోయే ప్రదం కూడా ఉంది. “

ఇక్కడ పెలికాన్లు మాత్రమే కాక అనేక ఇతర పక్షులు కూడా సీజన్ వచ్చేసరికి ఇక్కడకు వచ్చేస్తాయి.

 

కొక్కెరే బెల్లూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొక్కెరే బెల్లూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొక్కెరే బెల్లూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొక్కెరే బెల్లూర్

  • రోడ్డు ప్రయాణం
    బస్సు మార్గం కొక్కేరే బెల్లూర్ రోడ్ మార్గంలో తేలికగా చేరవచ్చు. బెంగుళూరు నుండి సుమారు 83 కి.మీ. దూరంలో కలదు. బెంగుళూరు - మైసూరు రహదారిలో ఒక వైపుకు తిరిగి నేరుగా కొక్కేరే బెల్లురు కు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కొక్కేరే బెల్లురు కు సమీప రైలు స్టేషన్ మద్దూరులో కలదు. మండ్య రైలు స్టేషన్ కూడా సమీపమే. ఇవి మైసూరు = బెంగుళూరు రైలు మార్గంలో కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    చేరటం ఎలా? కొక్కెరే బెల్లురు చేరేటందుకు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయము అనుకూలం. సమీప విమానాశ్రయం అంటే మైసూరు స్థానిక విమానాశ్రయం
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue