జాన్ సుల్లివన్మెమొరిఅల్ కోటగిరి టవున్ మధ్య భాగంనుండి రెండు కిలో మీటర్ల దూరం లో వుంటుంది. జాన్ సుల్లివన్ అనే అతను ఒక ఇంగ్లీష్ సేవకుడు. ఇతను మొట్ట మొదటగా ఊటీలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ కారణంగానే నేటికి ఈ నీలగిరులు మనకు లభించాయి. ఆయన జీవిత కాలంలో అక్కడి స్థానికుల సమస్యలతో పోరాడేవాడు. వారి నుండి మంచి గౌరం పొందేవాడు. ఈప్రాంతంలో తేయాకు తోటలు అధిక విస్తీర్ణం లో సాగు చేయటానికి ఆయనే కారకుడు. ఆయన క్రి. శ. 1788 లో జన్మించి, క్రి. శ 1855 లో మరణించాడు.
జాన్ సుల్లివన్ మెమోరియల్ ఆయన నివాస ప్రదేశంలో నిర్మించారు. దీనిని పెతకాల్ బంగాళా గా చెపుతారు. దీనిలో ఇపుడు నీలగిరి డాక్యుమెంటేషన్ సెంటర్ మరియు నీలగిరుల మ్యూజియం కలవు. మెమోరియల్ ఉ. 10 గం. నుండి సా. 5 గం. వరకూ తెరచి వుంటుంది. ప్రవేశ రుసుము రూ.10 పెద్దలకు రూ.5 పిల్లలకు కలదు.



Click it and Unblock the Notifications