Search
  • Follow NativePlanet
Share

మోరి - 'గేటు వే టు ది టాన్స్ వాలీ'!

8

ఉత్తరఖండ్ లో ని ఉత్తరఖండ్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం మోరి. ప్రఖ్యాతి పొందిన ఈ పర్యాటక ప్రాంతం సముద్ర మట్టం నుండి 3700 అడుగుల ఎత్తులో నెలకొని ఉంది. జన్సర్ బవార్ ప్రాంతం లో టామస్ గా కూడా పిలువబడే టాన్స్ నది ఒడ్డున ఈ ప్రాంతం ఉంది. మోరి ని 'గేటు వే టు ది టాన్స్ వాలీ' అని కూడా అంటారు. పురాణాల ప్రకారం, గొప్ప ఇతిహాసం అయిన మహాభారతం లో ని ఒక పౌరాణిక పాత్ర అయిన భబృవహన్ కన్నీటి తో ఈ టాన్స్ నది ఏర్పాటయిందని అంటారు. ఆ కన్నీటి చుక్కలు ఈ నదిలో ఇప్పటికీ ప్రవహిస్తున్నాయని స్థానికుల విశ్వాసం. అందుచేత వారు ఈ నీటిని తాగరు. అయితే, ఇంకొంత మంది నమ్మకం ప్రకారం సూర్పనక (రామాయణం లో ని పాత్ర) కన్నీటి తో ఈ నది ఏర్పడిందని అంటారు.

ఈ ప్రాంత నివాసితులు కౌరవులని అలాగే పాండవులని తమ పూర్వికులుగా పరిగణిస్తారు. పౌరాణిక యుద్ద వీరులు అలాగే గొప్ప ఇతిహాసం అయిన మహాభారతానికి చెందిన రాజులు వీరు. స్థానికులు మహాభారతం లో ప్రతినాయకులైన కౌరవులను పూజిస్తారు. జఖోల్ గ్రామం లో ప్రఖ్యాతి చెందినా దుర్యోధన ఆలయం ఉంది. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడికి ఈ మందిరం అంకితమివ్వబడినది. సౌర్ గ్రామం యొక్క నివాసితులు ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు.

కామ్పింగ్ కి అనువైన ఈ ప్రాంతం చుట్టూ ఆసియా లో నే అత్యుత్తమైనదిగా పరిగణించబడే అందమైన పచ్చటి పైన్ తోటలు కనిపిస్తాయి. అందుబాటు ధరల లో నే పర్యాటకుల కోసం అనేక రిసార్ట్స్ లు కామ్పింగ్ సదుపాయాలను అందిస్తున్నాయి. చలిమంట అలాగే బొర్బెక్యు వంటి వాటిని ఈ రిసార్ట్స్ లు నిర్వహించడం ద్వారా పర్యాటకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తున్నాయి. ఆంగ్లింగ్, రాఫ్టింగ్ మరియు కయాకింగ్ వంటి సాహసోపేతమైన జల క్రీడలని టాన్స్ నదిలో ఆనందించే అవకాశం మోరి కల్పిస్తుంది. బండర్పున్చ్ పర్వతం నుండి ఉద్భవించిన ఈ నది యమునా నది యొక్క అతి పెద్దదైన ఉపనది. ట్రెక్కింగ్ జంగిల్ వాక్, రాక్ క్లైంబింగ్ మరియు రాపెలింగ్ వంటి ఇతర సాహసోపేతమైన కార్యక్రమాలలో కూడా పర్యాటకులు పాల్గొనవచ్చు.

వాయు, రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులు మోరి కి చేరుకోవచ్చు. ఇక్కడికి సమీపం లో ఉన్న విమానాశ్రయం గా 175 కిలో మీటర్ల దూరం లో డెహ్రాడున్ లో ఉన్న జోలీ గ్రాంట్ విమానశ్రయాన్ని పరిగణించవచ్చు. డెహ్రాడున్ లో ఉన్న రైల్వే స్టేషన్ మోరి కి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్. సమీప నగరాల నుండి పబ్లిక్ అలాగే ప్రైవేటు బస్సుల సదుపాయం కలదు.

మోరి ని సందర్శించాలనుకునే పర్యాటకులకి ఎండాకాలం అలాగే వర్షాకాలం అనువైనవి. ట్రెక్కింగ్ కి ఎండాకాలం అనువైతే, వర్షాకాలం లో రాఫ్టింగ్ మరియు కయాకింగ్ సౌకర్యవంతంగా ఉంటాయి.

మోరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మోరి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మోరి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మోరి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : పొరుగున ఉన్న అన్ని పట్టణాలకి మోరి నుండి రెగ్యులర్ బస్సు సర్వీసు లు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ లేదా ప్రైవేటు బస్సు సర్విసుల ని పర్యాటకులు వినియోగించుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : మోరి కి సమీపం లో ఉన్న విమానాశ్రయం కిలోమీటర్ల దూరం లో డెహ్రాడున్ లో ఉన్న రైల్వే స్టేషన్. దేశం లో ని అన్ని ప్రధాన నగరాలకి ఈ రైల్వే స్టేషన్ చక్కగా అనుసంధానమై ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి మోరీ చేరుకునేందుకు అందుబాటు ధరలలో టాక్సీ సేవలు లభ్యమవుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : మోరి కి సమీపం లో ఉన్న విమాశ్రయం 186 కిలోమీటర్ల దూరం లో డెహ్రాడున్ లో ఉన్న జాలీ గ్రాంట్ విమానాశ్రయం. మోరి నుండి 410 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమాశ్రయం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయం రెగ్యులర్ ఫ్లైట్స్ ద్వారా దేశం లో ని వివిధ ప్రధాన పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది. జోలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి పర్యాటకులు మోరీ చేరుకునేందుకు టాక్సీ సేవలను పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Jun,Thu
Return On
19 Jun,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Jun,Thu
Check Out
19 Jun,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Jun,Thu
Return On
19 Jun,Fri