Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» లాన్స్ డౌన్

లాన్స్ డౌన్ - సైనిక స్థావర పట్టణం!

21

లాన్స్ డౌన్ ఉత్తరాఖండ్ పూరీ జిల్లా లో ఉన్న ఒక సైనిక స్థావర పట్టణం. ఇది సముద్ర మట్టానికి 1706 మీటర్ల ఎత్తులో ఒదిగిన ఒక అందమైన పర్వత పట్టణం. స్థానిక భాషలో, ఈ స్థలం 'కలుదండ' అనగా 'నల్ల కొండ' గా పేరుపొందింది. ఈ పర్వత పట్టణం 1887 లో అప్పటి భారతదేశ వైస్రాయి లార్డ్ లాన్స్ డౌన్ స్థాపించారు.

ఈ స్థలం గఢ్వాల్ రైఫిల్స్ యొక్క నియామకాల కొరకు బ్రిటిష్ వారిచే ఒక శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయబడింది. ఈ స్థలం వలసరాజ్య కాలంలో స్వతంత్ర సమరయోధులు కేంద్రంగా కూడా పనిచేసింది. ప్రస్తుతం, భారత సైన్యం యొక్క గఢ్వాల్ రైఫిల్స్ ఆదేశ కార్యాలయం ఇక్కడ ఉంది. లాన్స్ డౌన్ అందమైన పచ్చని సిందూర మరియు పైన్ అడవులతో చుట్టబడి సందర్శకులకు మంత్రముగ్దులను చేసే దృశ్యాలు అందిస్తుంది. అదనంగా, ఈ పర్వతం జీవావరణ పర్యటనకు కూడా అత్యంత అనువైన ప్రదేశం.

పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో ఒకటి కణ్వాశ్రం. ఇది ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన పూరీ కి ప్రవేశమార్గంగా పనిచేసే ప్రసిద్ధ ఆశ్రమం. ఈ ఆశ్రమం అందమైన పచ్చని అడవులతో చుట్టబడి ఉంది. మాలిని నది ఇక్కడకు సమీపంలో ప్రవహిస్తుంది. హిందూ మత పురాణాల ప్రకారం, ప్రముఖ మహర్షి విశ్వామిత్రుడు ఈ ప్రదేశంలో ధ్యానం చేశారు. ఇక్కడ మరో ప్రముఖ మత ప్రదేశం హిందూ మత దైవం శివుడికి అంకితం చేయబడిన తారకేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం సముద్ర మట్టానికి 2092 మీటర్ల ఎత్తులో, ఒక కొండ మీద ఉంది. ప్రతి సంవత్సరం, పెద్ద సంఖ్యలో భక్తులు ప్రార్థనలు నిర్వహించడానికి ఈ మందిరాన్ని సందర్శిస్తారు.

ఈ స్థలం ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా లెక్కించే గఢ్వాల్ రైఫిల్స్ స్థావర యుద్ధ స్మారక చిహ్నం మరియు గఢ్వాలి సైనికుల భోజనశాల కు ప్రసిద్ధి చెందింది. ఈ యుద్ధ స్మారక చిహ్నం అప్పటి భారతదేశ సర్వ సైన్యాధికారి లార్డ్ రాలిన్సన్ ట్రెంట్ చేత 1923, నవంబర్ 11న స్థాపించబడింది. 1888 లో నిర్మించబడిన గఢ్వాలి సైనికుల భోజనశాల బ్రిటిష్ వారు నిర్మించిన పురాతన భవనాలలో ఒకటి. ఈ సైనికుల భోజనశాలను ఇప్పుడు ఆసియాలోనే ప్రముఖ సంగ్రహాలయాలలో ఒకటిగా లెక్కిస్తారు.

గఢ్వాల్ రైఫిల్స్ యొక్క యువ యోధులకు అంకితం చేయబడిన అందమైన కృత్రిమ సరస్సు భుల్లా తాల్, లాన్స్ డౌన్ యొక్క మరొక ప్రముఖ ఆకర్షణ. ఈ సరస్సు యొక్క పేరు 'తమ్ముడు' అనే అర్ధం వచ్చే గఢ్వాలీ పదం ‘భుల్లా’ నుండి వచ్చింది. యాత్రికులు ఈ సరస్సు లో బోటు విహారం వంటి అనుభవాలు పొందుతారు. భుల్లా తాల్ ఒక పిల్లల ఉద్యానవనం, ఒక వెదురు మచన్ మరియు అందమైన ఫౌంటైన్లను కూడా కలిగి ఉంది.

రాయల్ ఇంజనీర్స్ కల్నల్ ఎ.హెచ్.బి హ్యూమ్ 1895 లో నిర్మించిన సెయింట్ మేరీస్ చర్చ్ కూడా సందర్శించదగ్గ ప్రదేశం. గఢ్వాల్ రైఫిల్స్ స్థావర కేంద్రం, 1947లో వదిలివేయబడిన ఈ చర్చిని పునరుద్ధరించి, స్వాతంత్ర్యానికి పూర్వపు భారతదేశ చిత్రాల ప్రదర్శన కోసం ఉపయోగించారు. సైనిక స్థావర సంగ్రహాలయం, దుర్గా దేవి ఆలయం, సెయింట్ జాన్ చర్చి, హవాఘడ్ మరియు టిప్-ఇన్-టాప్ ఇక్కడి ఇతర ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.

సాహస ఔత్సాహికులు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ మరియు అడవి సవారీ అనుభవించవచ్చు. ప్రేమికుల బాట(లవర్స్ లేన్) అనబడే ఈ ప్రాంతపు ఉత్తమ ట్రెక్కింగ్ మార్గం నమ్మలేని ట్రెక్కింగ్ అవకాశాలను అందిస్తుంది. ఇక్కడి పచ్చని అడవులలో స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలం అనేకం ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడ అందమైన అడవులలో ప్రకృతి వ్యాహ్యాళికి కూడా వెళ్ళవచ్చు. సరసమైన ధరలలో అడవి సవారీ మరియు ట్రెక్కింగ్ నిర్వహించడానికి పలువురు మార్గదర్సకులు ఇక్కడ ఉంటారు.

లాన్స్ డౌన్ వాయు, రైలు, మరియు రహదారి మార్గాలలో ప్రధాన భారతీయ నగరాలతో కలపబడి ఉంది. డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం మరియు కోట్ ద్వారా రైల్వే స్టేషన్ ఇక్కడికి సమీప విమాన స్థావరం మరియు రైల్వేస్టేషన్. వాతావరణం అనుకూలమైనదిగా ఉండటం వల్ల ఈ అందమైన ప్రాంతంలో పర్యటించడానికి ఉత్తమ సమయం మార్చి నుండి నవంబరు వరకు గల కాలం.

లాన్స్ డౌన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లాన్స్ డౌన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లాన్స్ డౌన్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? లాన్స్ డౌన్

 • రోడ్డు ప్రయాణం
  రహదారి: లాన్స్ డౌన్ బస్సులు ద్వారా సమీపంలోని స్థలాలతో బాగా అనుసంధానించబడింది. ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్య బస్సులు డెహ్రాడూన్, హరిద్వార్ మరియు మసూరీ నుండి లాన్స్ డౌన్ కు తరచుగా అందుబాటులో ఉంటాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం: కోట్ ద్వారా రైల్వే స్టేషన్ లాన్స్ డౌన్ నుండి 40 కి.మీ.ల దూరంలో ఉన్న సమీప రైలు మార్గం. ఈ రైల్వే స్టేషన్ తరచు రైళ్ళ ద్వారా భారతదేశ నగరాలతో అనుసంధానం చేయబడుతుంది. రైల్వే స్టేషన్ నుండి లాన్స్ డౌన్ కు టాక్సీలు సులభంగా అందుబాటులో ఉంటాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయుమార్గం: లాన్స్ డౌన్ సమీపంలోని వైమానిక స్థావరం 148 కి.మీ. దూరంలో ఉన్న డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం తరచుగా ఉండే విమానాల ద్వారా ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తో అనుసంధానించబడింది. యాత్రికులు జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి నగర కేంద్రం చేరుకోవడానికి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Jan,Mon
Return On
25 Jan,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
24 Jan,Mon
Check Out
25 Jan,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
24 Jan,Mon
Return On
25 Jan,Tue