అల్మోర - అందమైన పచ్చని అడవులు !

అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తున వుంది చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. క్రి. శ. 15 మరియు 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్ మరియు కాత్యూర్ వంశాలు పరి పాలించాయి.

పర్యాటకులు హిమాలయాల యొక్క మంచు తో నిండిన శిఖరాలను అల్మోర కొండలనుండి చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం ప్రపచంత వ్యాప్తంగా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాసర్ దేవి టెంపుల్, నందా దేవి టెంపుల్, చితి టెంపుల్, కాతర్మాల్ సన్ టెంపుల్ వంటివి ఇక్కడ కల కొన్ని మతపర క్షేత్రాలు. .

ఇక్కడ కల ప్రాచీనమైన నందా దేవి టెంపుల్ ను కుమావొనీ శిల్ప శైలి లో నిర్మించారు. ఈ టెంపుల్ లో చాంద్ వంశం పూజించిన దేవత కలదు. ప్రతి సంవత్సరం భక్తులతో దేవాలయం కిట కిట లాడుతుంది. ఇక్కడే మరొక టెంపుల్ కాసర్ దేవి టెంపుల్ కూడా అల్మోర కు 5 కి.మీ.ల దూరం లో కలదు. ఈ టెంపుల్ ను 2 వ శతాబ్దం లో నిర్మించారు. స్వామి వివేకానంద తన తపస్సు ను ఇక్కడ చేసారని చెపుతారు.

పర్యాటకులు ఇక్కడ అందమైన సూర్యోదయ మరియు సూర్యాస్తమయ దృశ్యాలు బ్రైట్ ఎండ్ కార్నర్ నుండి చూడవచ్చు. సిమ్టోల మరియు మర్టోల ప్రదేశాలు పిక్నిక్ కు బాగుంటాయి. అల్మోర టవున్ నుండి ౩ కి. మీ.ల దూరం లో కల జింకల పార్క్ ప్రసిద్ధి. దీనిలో అనేక లేళ్ళు, చిరుతలు హిమాలయ బ్లాకు బేర్ వంటివి కలవు. ఈ ప్రదేశం లో కల గోవింద్ వల్లభ పంత్ మ్యూజియం, బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి తప్పక చూడాలి. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ తప్పక ఆచరిస్తారు. ఈ ప్రదేశానికి వాయు, రైలు, రోడ్ మార్గాలలో తేలికగా చేరవచ్చు. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్, కతోగోడం రైల్వే స్టేషన్ అల్మోర కు సమీపం. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.

Please Wait while comments are loading...