Search
 • Follow NativePlanet
Share

కౌసని - సుందరమైన పర్వత పట్టణం

21

కౌసని సముద్ర మట్టానికి సుమారుగా 6075 అడుగుల ఎత్తులో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక సుందరమైన పర్వత పట్టణం. గొప్పవైన హిమాలయాలతో పాటు నందాకోట్, త్రిశూల్, మరియు నడ దేవి వంటి పర్వతాలు ఇక్కడ నుండి సులభంగా కనిపిస్తాయి. ఈ కొండ పట్టణం దట్టమైన దేవదారు చెట్లు మధ్య ఒక కొండల పైన ఉంది, మరియు సోమేశ్వర, గరూర్, మరియు బైజ్నాథ్ కత్యురి యొక్క అందమైన లోయలను చూపిస్తుంది .

ప్రాచీన కాలంలో , ఈ పట్టణంను వల్న అని పిలిచేవారు,మరియు అల్మోరా జిల్లాలో ఒక భాగమైంది. ఆ సమయంలో, ఆ జిల్లా కత్యురి కింగ్ నిర్వహణలో ఉన్నది. తరువాత, రాజు శ్రీ చంద్ తివారీ, ఒక గుజరాతీ బ్రాహ్మణ భూమిని ఒక ముఖ్యమైన భాగంగా ఇచ్చారు. గొప్ప భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు అయిన మహాత్మా గాంధీ ఈ స్థలం యొక్క గొప్ప వైభవమునకు ఆశ్చర్యపడి ఈ కొండ పట్టణంను 'భారతదేశం యొక్క స్విట్జర్ల్యాండ్' అని పేర్కొన్నారు. ప్రస్తుతం కౌసని ని ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శించిన ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు.

అంతే కాకుండా అందమైన కొండలు మరియు పర్వత ప్రాంతంలో ఉన్న ఆశ్రమములు, దేవాలయాలు మరియు టీ ఎస్టేట్ లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రసిద్ధ ఆశ్రమములు ఉన్నాయి.ఆ ఆశ్రమాల్లో ఒకటి అయిన అనాశక్తి ఆశ్రమములో మహాత్మా గాంధీ కొన్ని రోజుల నివసించారు. అక్కడ బస మరియు వంటగది సౌకర్యాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ఆశ్రమం ఒక స్టడీ-కమ్-పరిశోధన కేంద్రంగా మార్చబడింది. మరో ప్రఖ్యాత ఆశ్రమం లక్ష్మి ఆశ్రమము కూడా ఉంది.దానిని సరళ ఆశ్రమం అని పిలుస్తారు. ఈ ఆశ్రమం ను 1948 వ సంవత్సరంలో మహాత్మా గాంధీ అనుచరుడైన కాథరిన్ హిల్మాన్ స్థాపించెను.

పిన్నాథ్ ఆలయం, శివాలయం,రుద్రహరి మహాదేవ్ ఆలయం, కోట్ భ్రమరి ఆలయం మరియు బైజ్నాథ్ ఆలయం మొదలైనవి కౌసనిలో ఉన్న ముఖ్యమైన మత ప్రదేశములు. పిన్నాథ్ ఆలయంలో హిందూ మత దేవుడైన భైరాన్ కొలువై ఉన్నారు, మరియు సముద్ర మట్టంనకు 2750 మీ ఎత్తులో ఉంది. కౌసని కి 11 కి.మీ. దూరంలో ఉన్న సోమేశ్వర్ పట్టణంలో శివ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో హిందూ మత దేవుడైన శివుడు కొలువై ఉన్నారు,మరియు చంద్ రాజవంశ స్థాపకుడు అయిన కింగ్ సొం చంద్ నిర్మించారు.

అంతే కాకుండా, కౌసని ప్రఖ్యాత సమకాలీన హిందీ కవి సుమిత్ర నందన్ పంత్ యొక్క ఒక జన్మస్థలం. ఆయనకు అంకితం చేసిన సుమిత్ర నందన్ పంత్ గ్యాలరీ అనే మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో వ్రాతప్రతులు, అతని పద్యాలు మరియు ఇతర రచనల్లో డ్రాఫ్ట్ అలాగే ఆయన అందుకున్న అవార్డులు ఉన్నాయి. అయన జయంతి రోజును మ్యూజియం వద్ద జరుపుకుంటారు, మరియు ఒక సమావేశంను కూడా అతని గౌరవార్ధం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

ఈ ప్రదేశమును సందర్శించటం ద్వారా సాహస ఔత్సాహికులు ట్రెక్కింగ్ మరియు రాక్ క్లైంబింగ్ వంటి కార్యకలాపాలను అస్వాదించవచ్చు.ఇక్కడ దేశంలోనే ఉత్తమ ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. వాటిలో సుందర్ దుంగా ట్రెక్, పిండారీ గ్లేసియర్ ట్రెక్ మరియు మిలం గ్లేసియర్ ట్రెక్ వంటివి ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రాంతం హిందూ మత పండుగ 'మకర సంక్రాంతి'తో ప్రసిద్ధి చెందింది. ఈ వేడుకను 'ఉత్తరాయని' అని కూడా పిలుస్తారు.

కౌసనిని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విమాన, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరవచ్చు. అతి దగ్గరలో ఉన్న ఎయిర్ బేస్ పంత్ నగర్ విమానాశ్రయం. ఇది సాధారణ విమానాలు ద్వారా ఇతర భారతీయ నగరాలకు కలపబడింది. కత్గోడం రైల్వే స్టేషన్ సమీప రైల్వేస్టేషన్. ఇక్కడ నుండి హౌరా మరియు లక్నోతో సహా అన్ని భారతీయ నగరాలకు కలపబడింది. కౌసని బస్ స్టేషన్ అనేక ప్రాంతాలకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు అనుసంధానించబడింది. ప్రయాణికులకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్ మరియు జూన్ మధ్య కౌసని సందర్శించడానికి ఇష్టపడతారు.

కౌసని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కౌసని వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కౌసని

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? కౌసని

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం : అనేక ప్రభుత్వ బస్సులు రాణిఖెట్, నైనిటాల్, పిత్తోర్ గర్హ్ మరియు అల్మోర వంటి ప్రదేశాలు కౌసని కి ఒక క్రమ పద్ధతిలో బస్సులు నడపబడుతున్నాయి. ప్రైవేట్ పర్యాటక బస్సులు న్యూ ఢిల్లీ నుండి కూడా కౌసని కి అందుబాటులో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం కౌసని కి 132 కిలోమీటర్ల దూరంలో సమీప రైల్వే స్టేషన్ కత్గోడం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా లక్నో, కోలకతా, మరియు న్యూ ఢిల్లీ సహా భారతదేశం యొక్క వివిధ నగరాలకు కలపబడింది. కౌసని చేరటానికి టాక్సీలు మరియు బస్సులు రైల్వే స్టేషన్ నుండి సులభంగా అందుబాటులో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం కౌసని కి 162 కి.మీ. దూరంలో ఉన్న సమీప ఎయిర్ బేస్ పంత్నగర్ పట్టణంలో ఉన్న పంత్నగర్ విమానాశ్రయం. విమానాశ్రయం సాధారణ విమానాలు ద్వారా ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా పిలువబడే ఢిల్లీ విమానాశ్రయంనకు అనుసంధానించబడింది. యాత్రికులు కౌసని చేరుకోవడానికి విమానాశ్రయం నుండి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Jan,Mon
Return On
25 Jan,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
24 Jan,Mon
Check Out
25 Jan,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
24 Jan,Mon
Return On
25 Jan,Tue