ముక్తేశ్వర్ - మహాశివుడి ఆలయం పేరుతో !

ఉత్తరఖాండ్ లో ఉన్న కుమోన్ డివిజన్ లో ఉన్న నైనిటాల్ జిల్లా లో ఉన్న అత్యంత అధ్బుతమైన హిల్ స్టేషన్ ముక్తేశ్వర్. సముద్ర మట్టం నుండి 2286 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. 350 ఏళ్ళ క్రితానికి సంబంధించిన మహా శివుడి ఆలయం అయిన ముక్తేశ్వర్ ధం పేరే ఈ ప్రాంతానికి వచ్చింది. మహా శివుడు భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు.

1893 లో ఈ హిల్ స్టేషన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గా రూపాంతరం చెందింది. ఈ ప్రాంతం నుండి భారత దేశం లో నే రెండవ ఎత్తైన పర్వతం గా ప్రసిద్ది చెందిన నందా దేవి పర్వతాన్ని చూసి ఆనందించవచ్చు. 'ది మాన్ ఈటర్స్ ఆఫ్ కుమన్' అనబడే ఆకర్షణీయమైన నవల రచించిన బ్రిటిష్ హంటర్ మరియు ప్రక్రుతి శాస్త్రవేత్త అయిన జిమ్ కార్బెట్ వల్ల కూడా ముక్తేశ్వర్ ప్రసిద్ది చెందింది. కుమన్ లో సంచరించిన అపాయకరమైన ఆరు పులుల్ని జిమ్ కార్బెట్ సంహరించాడు. వందల మంది స్థానికుల ప్రాణాలు తీసుకున్న చంపావత్ టైగర్ మరియు పనార్ చిరుతలు అయన సంహరించిన వాటిలో ఉన్నాయి.

ముక్తేశ్వర్ అడవులు రీసస్ మంకీ, లంగూర్ జబ్బెర్స్, డీర్, రారే మౌంటెన్ బర్డ్స్, మౌంటెన్ లేపర్డ్స్ మరియు హిమాలయన్ బ్లాక్ బీర్స్ వంటి వాటికీ నివాస స్థలం. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు హిమాలయన్ రూబీ త్రోట్, వైట్ క్రేస్టేడ్ లాఫింగ్ త్రష్, రెడ్ బిల్ల్ద్ లియొత్రిక్ష్ మరియు బ్లాక్ విన్గ్ద్ కైట్ వంటి వివిధ రకాల పక్షులని తిలకించవచ్చు. వీటితో పాటు అరుదుగా కనిపించే హిమాలయన్ మౌంటెన్ క్వైల్ ని కూడా గమనించవచ్చు. రాక్ క్లైంబింగ్, రాప్పేల్లింగ్ వంటి వివిధ సాహసోపేతమైన క్రీడలను ఈ ఎత్తైన పర్వత శ్రేణి ప్రాంతం లో పర్యాటకులు ఆనందించవచ్చు.

హిందూ దైవం అయిన మహా శివుడికి అంకితమివ్వబడిన ప్రాచీన మందిరం ముక్తేశ్వర టెంపుల్. ఇందులో తెల్లటి పాలరాయి శివలింగం ప్రతిష్టింపబడి ఉంది. ఈ శివలింగం చుట్టూ బ్రహ్మ, విష్ణు, పార్వతి, హనుమాన్, గణేష్ మరియు నంది వంటి వివిధ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయానికి రాతి మెట్లు ఎక్కడం ద్వారా చేరుకోవచ్చు.

7000 అడుగుల ఎత్తులో ఉన్న అందమైన కొండ ప్రాంతం సిట్లా. ముక్తేశ్వర్ కి సమీపం లో ఈ ప్రధాన పర్యాటక మజిలీ ఉంది. దాదాపు 39 ఎకారాల మేరకు విస్తరించబడిన ఈ హిల్ స్టేషన్ అద్భుతమైన హిమాలయన్ పర్వత శ్రేణుల యొక్క అందాలను తిలకించడానికి అనువైన ప్రాంతం. దట్టమైన ఓక్ మరియు పైన్ వృక్షాలు ఈ హిల్ స్టేషన్ చుట్టూ కనువిందు చేస్తాయి.

ముక్తేశ్వర్ ఆలయానికి సమీపం లో ఉన్న చౌతి జాలి లేదా చౌలి కి జాలి కి సంబంధించి ఎన్నో పురాణం గాధలు ఉన్నాయి. రాక్షస మరియు దేవత ల మధ్య పోరు ఇక్కడ సాగిందని అంటారు. లోహపు పలక ఏనుగు మొండెం మరియు కత్తి యొక్క సన్నటి సరిహద్దు రేఖలు ఇక్కడ గమనించవచ్చు. ఏడాది పొడవునా ఈ ప్రాంతం ఏంతో మంది భక్తులతో సందర్శింపబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ ప్రాచీన రాజారాని టెంపుల్. 11 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ ఆలయం లో రాజా రాణి యొక్క అందమైన రాతి విగ్రహం కనబడుతుంది.

1050 లో నిర్మితమయిన బ్రహ్మేశ్వర టెంపుల్ ప్రముఖమైన పుణ్యక్షేత్రం. చక్కని శిల్పాలు మరియు రాతి చేక్కడాలని సేకరణలని ఈ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులు గమనించవచ్చు. అద్భుతమైన హిమాలయ పర్వత శ్రేణుల యొక్క అందాలని తిలకించడానికి అనువైన ప్రాంతం కుమన్ హిల్స్ పై ఉన్న నతుకన్ అనే కుగ్రామం. ఈ ప్రాంతం చుట్టూ ఓక్, పైన్, బిర్చ్ మరియు కఫల్ వృక్షాలు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణ కలిగిస్తాయి. ఇక్కడ శిధిలావస్తలో ఉండే కుటీరాలని గమనించవచ్చు. నేచర్ వాక్స్ మరియు ట్రెక్కింగ్ ల ని పర్యాటకులు ఆనందించవచ్చు.

1893 లో ఏర్పాటయిన ది ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక హెరిటేజ్ కలోనియల్ ఆర్గనైశేషన్. భారత దేశం లో వెటర్నరీ సైన్స్ అభివృద్ధి కోసం ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. జివాణు విజ్ఞానం, జన్యు శాస్త్రం, జంతువుల పోషణ వంటి వాటిపై ఈ సంస్థ విస్తృతమైన పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇక్కడి ప్రాంగణం లో ఉన్న మ్యూజియం ఇంకా లైబ్రరీ సందర్శించదగ్గవి.

శివ టెంపుల్ కి సమీపం లో ఉన్న ముక్తేశ్వర్ ఇన్స్పెక్షన్ బంగళా ప్రసిద్దమైన బ్రిటిష్ హంటర్ మరియు ప్రక్రుతి శాస్త్రవేత్త అయిన జిమ్ కార్బెట్ కి అంకితమివ్వబడినది. జిమ్ కార్బెట్ విశ్రాంతి మందిరం గా ఈ బంగాళా వ్యవహరించేది. హనీకరమైన పులులని వధించడానికి ఇక్కడే అతను వ్యూహం పొందేవాడు. ఇతను వాడిన కెటిల్ ని ఈ బంగళా లో గమనించవచ్చు.

వాయు, రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా ముక్తేస్వర్ వివిధ ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంది. ఏడాది పొడవునా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరం గా ఉంటుంది. శీతాకాలం మరియు వర్షాకాలం లో ట్రాఫిక్ సమస్యల వల్ల ఫ్లైట్ లు ఆలస్యమవడం వల్ల ఈ సమయం లో ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడం ఉత్తమం.

Please Wait while comments are loading...