Search
  • Follow NativePlanet
Share

చంబ - అందమైన ఒక హిల్ స్టేషన్ !

14

చంబ ప్రదేశం ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది ఉత్తరాఖండ్ లోని తెహ్రి గర్హ్వాల్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1524 మీటర్ల ఎత్తున కలదు. ఇక్కడ కల అందమైన దృశ్యాలకు నిర్మల వాతావరణానికి ఈ ప్రదేశం పేరు గాంచినది. చంబా ప్రాంతం దేవదారు మరియు పైన్ చెట్ల తో నిండి, ప్రకృతి ప్రియులకు ఒక స్వప్న సౌధంలా వుంటుంది. ఈ హిల్ స్టేషన్ లో ఆపిల్ మరియు అప్రికాట్ తోటలు అధికం. రిషి కేష్, సుర్కండ దేవి టెంపుల్, తెహ్రి డాం పర్యటనకు వెళ్లేవారికి చంబ హిల్ స్టేషన్ ఒక పూట బసకు అనుకూలంగా వుంటుంది. ఇక్కడ గబ్బర్ సింగ్ నేగి మెమోరియల్ మరియు శ్రీ బాగేశ్వర్ మహాదేవ మందిర్ లు ఆకర్షణా స్థలాలు.

చంబ సందర్శకులకు గబ్బర్ సింగ్ నేగి మెమోరియల్ ప్రసిద్ధి. దీనిని 1925 లో ఠాకూర్ గబ్బర్ సింగ్ నిర్మించారు. ఈయన గర్హ్వాల్ రైఫిల్ లో ఒక రైఫిల్ మాన్ గా 1925 లో పని చేసారు. మొదటి ప్రపంచ యుద్ధం లో నేగి తన సైనిక దళాలతో కలసి జర్మనీ దేశంతో పోరాడి యుద్ధాన్ని గెలిచాడు. ఆయన ధైర్య సాహసాలకు గాను ఆయనకు మరణాంతరం ఒక విక్టరీ క్రాస్ ను సాహసోపేత అవార్డ్ ను బహుకరించారు. ఈ యోధుడికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 వ తేదీన గర్హ్వాల్ రెజిమెంట్ ఆయనకు నివాళులు అర్పిస్తుంది.

చంబ లో మరొక ఆకర్షణ అంటే శ్రీ బాగేశ్వర్ మహాదేవ మందిర్. ఇది ఒక ప్రసిద్ధ క్షేత్రం. ప్రతి సంవత్సరం అనేక మంది యాత్రికులు వస్తారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ కల శివ లింగం భూమి లో నుండి ప్రత్యక్షం అయ్యిందని చెపుతారు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

పర్యాటకులు చంబ ప్రదేశాన్ని వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. డెహ్రాడూన్ లో కల జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ దీనికి సమీప విమానాశ్రయం. సుమారు 80 కి. మీ. ల దూరంలో కల ఈ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రెగ్యులర్ విమానాలు కలవు.

జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుండి చంబ చేరేందుకు పర్యాటకులు టాక్సీ లు పొందవచ్చు.

రిషి కేష్ రైలు స్టేషన్ సుమారు 60 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ నుండి పర్యాటకులు టాక్సీల లో చంబ హిల్ స్టేషన్ చేరవచ్చు. ఈ ప్రదేశానికి బస్సు లు, టాక్సీ లు సమీప నగరాల నుండి నడుస్తాయి. శ్రీనగర్, దేహ్రదూర్, తెహ్రి, దేవప్రయాగ్, ఉత్తరకాశి, మస్సూరీ, రుషి కేష్ ల నుండి నేరు బస్సు లు కలవు.

చంబ వాతావరణం ఒక మోస్తరు వేడి, చలితో ఆహ్లాదకరంగా వుంటుంది. ఈ కారణంగా పర్యాటకులు సంవత్సరం పొడవునా ఈ హిల్ స్టేషన్ సందర్శిస్తారు. వేసవిలో గరిష్టం గా 30 డిగ్రీలు, కనిష్టం గా 14 డిగ్రీలు ఉష్నోగ్రతలుంటాయి. జూలై నెలలో వర్షాకాలం మొదలవుతుంది. వర్షాలు ఒక మోస్తరు గా పడతాయి. వింటర్ నవంబర్ లో మొదలవుతుంది. ఈ సమయం లో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు మాత్రమే వుండి అధిక చలిగా వుంటుంది.

కనుక అతి చల్లగా వుండే వింటర్ లో సందర్శన సూచించ దగినది కాదు. మార్చ్ నుండి జూన్ చివరి వరకూ సందర్శనకు సూచించ దగినది.

చంబ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చంబ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చంబ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చంబ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం సమీపం లోని నగరాల నుండి బస్సు లు, టాక్సీ లు చంబ కు నడుస్తాయి. డెహ్రాడూన్, రిషికేశ్, మస్సూరీ, దేవప్రయాగ్, తెహ్రి, ఉత్తరకాశి, శ్రీనగర్ ల నుండి చంబ కు లక్జరీ బస్సు లు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం చంబ కు రిషి కేష్ రైలు స్టేషన్ సమీపం. సుమారు 60 కి. మీ. ల దూరంలో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశం లోని వివిధ ప్రధాన నగరాలకు చేరవచ్చు. ఈ రైలు స్టేషన్ నుండి చంబ కు టాక్సీలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం సుమారు 80 కి. మీ. ల దూరంలో కల డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ సమీప విమానాశ్రయం. ఇక్కడ నుండి ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరచుగా విమానాలు నడుస్తాయి. జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లలో ఈ హిల్ స్టేషన్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue