ఛౌకొరి - అందమైన కొండ ప్రాంతం !

ఛౌకొరి ఉత్తరాఖండ్ ఫిథొరగర్ జిల్లాలో సముద్ర మట్టానికి 2010 మీటర్ల ఎత్తులో నిలిఛి ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. పశ్చిమ హిమాలయాల పర్వత శ్రేణులు మధ్య ఉన్న ఈ ప్రదేశానికి ఉత్తరాన టిబెట్ మరియు దక్షిణాన తెరాయ్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ అద్భుతమైన కుగ్రామం, ఆకుపచ్చని పైన్, ఓక్, మరియు రోడోడెండ్రాన్ అడవులతో నిండి ఉంది. ఆకర్షణీయమైన పచ్చని పొలాలు మరియు తోటలు ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి దోహదం చేస్తున్నాయి.

ఛౌకొరిలో అతిపురాతనమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. బెరినాగ్ గ్రామంలో ఉన్న నాగమందిర్ చూడతగ్గ ఆలయాలలో ఒకటి. బెనిమాధవ రాజు నాగవేణి ఈ ఆలయాన్ని కట్టిచారని ఒక నమ్మకం. పర్యాటకులు సముద్ర మట్టానికి 1350 మీ. ఎగువన ఉన్న పాతాల్ భువనేశ్వర్ ని కూడా సందర్శించవొచ్చు. ఈ ఆలయం సొరంగ ఆకారంలో ఉన్న గుహలో ఉన్నది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది.

చౌకొరిలో ఉన్న మహాకాళి దేవాలయం చాల ప్రాచుర్యం చెందింది. ఇండియాలోని శక్తి పీఠాలలో ఇది ఒకటి. దీనిని శక్తి పీఠాలలో ఒక దేవాలయంగా ఆది గురు శంకరాచార్య ఎన్నుకుని, దీనిని మహాకాళి దేవతకు అంకితం చేశారు. పర్యాటకులు పిథొరగర్హ్ చండక్ రోడ్ మీద ఉన్న అతిథి గృహానికి దగ్గరలో ఉన్న ఉల్కా దేవి ఆలయాన్ని కూడా సందర్శించవొచ్చు. అందమైన దేవతల బొమ్మలను రాతి మీద చెక్కడం ఘునసేర దేవి ఆలయంలో చూడవొచ్చు. ఇంకా కామాక్షి దేవాలయం మరియు కేదార్ దేవాలయాలను చౌకొరిలో చూడవలసిన పుణ్యక్షేత్రాలు.

యాత్రికులు విమానం, బస్సు, రైల్ మార్గాల ద్వారా సునాయాసంగా చేరుకోవొచ్చు. చౌకొరికి సమీపంలో 'పంత్ నగర్ ఎయిర్ పోర్ట్' విమానాశ్రయం ఉన్నది.. దీనికి దగ్గరగా 'ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్', న్యూ ఢిల్లీ ఉన్నది. దీనికి దగ్గరలో కత్గోదం రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ నుండి చౌకొరికి టాక్సీని అద్దెకు తీసుకొని చేరుకోవొచ్చు. పెద్ద నగరాలనుండి బస్సులు కూడా ఇక్కడికి అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులకు ఈ అందమైన కొండ ప్రాంతాన్ని వేసవికాలంలో కాని లేదా శీతాకాల ప్రారంభ దశలో కాని సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది.

Please Wait while comments are loading...