ఎలా చేరాలి?

రోడ్డు మార్గం నగరము లోపలకు, వివిధ నగరాలకు, దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణానికి గాను నగరములో సుమారైన రవాణ వ్యవస్థ ఉంది. అయితే నగరములో మూడు బస్సు స్టాండ్ లు ఉన్నాయి. నగరము చుట్టూ ప్రక్కల ప్రాంతాలకు మరియు పరిసర పట్టణాలకు వెళ్లే అన్ని ప్రైవేట్ బస్సులు పాలయం బస్సు స్టాండ్ నుండి బయిలుదేరుతాయి. పరిసర జిల్లాలకు మరియు పాలక్కాడ్, త్రిస్సూర్, కన్నూర్, కాసర్గోడ్, ఎర్నాకుళం, సుల్తాన్ బతేరి, మలప్పురం వంటి నగరాలకు వెళ్లే బస్సులు ఇందిరా గాంధి రోడ్ లో (మావూర్ రోడ్) ఉన్న క్రొత్త బస్సు స్టాండ్ లో ఉంటాయి. కేరళ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (KSRTC) నడిపే బస్సులు ఇందిరా గాంధి రోడ్ లో (మావూర్ రోడ్) ఉన్న KSRTC బస్సు స్టాండ్ నుండి నడుస్తాయి. చుట్టూ పక్కన ఉన్న పట్టణాలకు, నగరాలకు మరియు ఎర్నాకుళం, కొట్టయం, పతనంతిట్ట, తిరువనంతపురం, కోయంబతూర్, ఊటీ,మధురై, బెంగుళూరు, మైసూరు వంటి నగరాలకు క్రమమైన రీతిలో KSRTC బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ వారు బెంగుళూరు, ఊటీ, మధురై వంటి నగరాలకు క్రమేణా లగ్షరీ బస్సు సేవలు అందిస్తున్నారు. ఈ బస్సులు ప్రధానంగా పాల్యం నుండి బయిలుదేరుతాయి.