Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొజ్హికోడ్ » వాతావరణం

కొజ్హికోడ్ వాతావరణం

బెస్ట్ సీజన్కాలికట్ ను సంవత్సరం అంతా పర్యాటకులు సందర్శించవచ్చు, కానీ జూన్,జులై నెలల్లో విపరీతమైన వానలు ఉంటాయి.అప్పుడు సందర్శనకు వీలు ఉండదు.భారీ వర్షాల తర్వాత ఆగష్టు నుండి వేసవి ప్రారంభానికి ముందు ఫిబ్రవరి వరకు పర్యాటకులకు సందర్శించడానికి అనువైన సమయం. 

వేసవి

వాతావరణంవేసవి కాలంకాలికట్ తీర ప్రాంతంనకు సమీపంలో ఉండుట వలన ప్రధానంగా తేమ ఎక్కువగా ఉంటుంది.వేసవికాలం మార్చి నెల నుండి  మేనెల చివరి వరకు కొనసాగుతుంది. ఇది పక్షుల కేంద్రాలు మరియు బీచ్లు సందర్శించడానికి మంచి సమయం. వేసవిలో ఉష్ణోగ్రత 37 ° C నుండి 39 ° C వరకు ఉంటుంది. వేసవిలో నగరంను సందర్శించే ప్రయాణికులు తప్పనిసరిగా కాటన్ దుస్తులు మరియు కళ్ళజోళ్ళు వెంట తెచ్చుకోవాలి.

వర్షాకాలం

వర్షఋతువుకాలికట్జూ జూన్ నెలనుండి  సెప్టెంబర్ వరకు నాలుగు నెలలు భారీ వర్షం ఉంటుంది.ఈ  ప్రాంతంలో ఉన్న ఆనకట్టలు మరియు బీచ్లు సందర్శించడానికి ఇది  అనువైన సమయం కాదు. ఆగష్టు మరియు సెప్టెంబర్ లో ఓనం సీజన్ స్టార్ట్ అవుతుంది. మరియు నగరం అంతా ఉత్సాహం తో ఉరకలు వేస్తుంది.

చలికాలం

శీతాకాలముకాలికట్లో శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈ కాలం లోఉష్ణోగ్రతలు తక్కువుగా ఉంటాయి,వాతావరణం బాగుంటుంది.శీతాకాలములో  ట్రెక్కింగ్, బీచ్ ల  సందర్శన మరియు బోటింగ్ వంటి కార్యక్రమాలకు అనువుగా ఉంటుంది.రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండుట వల్ల పర్యాటకులు తప్పనిసరిగా ఉన్ని దుస్తులు వెంట తెచ్చుకోవాలి.