దీనినే "లాలా ప్రజన్ సాంక్చూరీ" అని కూడా పిలుస్తారు. ఇది 1992 లో జఖాఊ అనే గ్రామం వద్ద ప్రత్యేకం గా "ఇండియన్ బస్టర్డ్" గా పిలవద్బడే ఒక రకమైన పక్షి జాతి కోసం ఏర్పాటు చేయబడింది. ఇది ఎగిరే పక్షులలో అత్యంత బరువైనది. "ఓటిటిడాయ్" అనబడే ఒక రకం పక్షి జాతి లో "ఏవియన్" కుటుంబానికి చెందినది ఈ ఇండియన్ బస్టర్డ్ పక్షి.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతి పక్షులు కూడా అంతరించే వన్య ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ఇవి ఇక్కడ ఉన్న గడ్డి భూములతో కలిసిపోయి చూపరులకు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇంకా ఈ సాంక్చూరీ లో "క్రిష్ణ జింక","అడవి పిల్లి" మరియు "నిల్గాయిస్" లు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications