Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లడఖ్ » వాతావరణం

లడఖ్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం: లడఖ్ సందర్శించడానికి సరైన సమయం అక్కడి వేసవి, అనగా జూన్ మరియు సెప్టెంబర్ నెలల మధ్య కాలం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సగటున 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా ఉంటాయి. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల వరకు వెళ్ళవచ్చు.

వేసవి

లడఖ్ తీవ్రమైన శీతాకాలాలతో విపరీత వాతావరణం కలిగిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అయితే, వేసవులు తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉండి, ప్రయాణికులకు అనువుగా ఉంటాయి.వేసవి కాలం(జూన్ నుంచి సెప్టెంబర్): యాత్రికులు లడఖ్ పర్యటనను వేసవి లో చేయడం మంచిది. ఈ కాలం లోని నిర్మలమైన ఆకాశం, మధ్యస్థ వాతావరణం, యాత్రికులకు వివిధ ఆకర్షణలు చూసేందుకు వీలు కల్పించి, ఈ ప్రాంతాన్ని అత్యుత్తమ ఆటవిడుపు ప్రదేశంగా మారుస్తాయి. ఈ సమయంలోని ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా ఉంటాయి.  

వర్షాకాలం

వర్షా కాలం: వర్షా కాలం లో లడఖ్ 90 మి.మీ ల మధ్యస్థ వర్షపాతం నమోదు చేస్తుంది. అయితే, ఈ సమయంలో, కొండ చెరియలు విరిగి పడే ప్రమాదం వల్ల, ఈ కనుమ మూసి ఉంచబడుతుంది.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుంచి మే): లడఖ్ లోని శీతాకాలం విపరీతమైన చల్లగా, తీవ్రంగా ఉంటుంది. ఈ కాలం లోని ఉష్ణోగ్రతలు, -28 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం ఉంది. యాత్రికులు, గడ్డ కట్టే వాతావరణ పరిస్థితుల వల్ల, మంచు తిమ్మిరి కి గురి కావచ్చు. అప్పుడప్పుడు ఈ శీతాకాలంలో హిమపాతం కూడా కనిపిస్తుంది. ఫలితంగా, ఈ కాలం ఈ ప్రాంతంలో సందర్శన కోసం అనుకూలమైనదిగా పరిగణించబడదు.