Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లెహ్ » వాతావరణం

లెహ్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం :మార్చ్ నుంచి అక్టోబర్ నెలల మద్య లెహ్ సందర్శన మంచిదని భావిస్తారు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు మధ్యస్తంగా వుండడం వల్ల యాత్రికులు ఇక్కడి అందాలను ఆస్వాదించ గలుగుతారు, పర్వతారోహణ లాంటి సాహస కృత్యాలు కూడా చేయగలుగుతారు. ఐతే యాత్రికులు మాత్రం అన్ని వేళలా తమతో ఉన్ని దుస్తులు తీసుకు వెళ్లి అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలి.

వేసవి

లెహ్ లో వాతావరణం అనూహ్యంగా వుంటుంది. అందువల్ల యాత్రికులు ఇక్కడి వాతావరణం లోని తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ఎప్పుడూ ఉన్ని దుస్తులు తీసుకు వెళ్ళాలి.వేసవి (మార్చ్ నుంచి జూన్ దాకా) : వేసవిలో లెహ్ లో అత్యధికంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత వుంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల మధ్య వుంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత మధ్యస్తంగా వుంటుంది కనుక యాత్రికులు ఈ సమయంలోనే సందర్శించడం మంచిదని సూచన.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుంచి సెప్టెంబర్ దాకా) : వర్షాకాలం లో లెహ్ లో 90 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదౌతుంది.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా) : లెహ్ లో శీతాకాలం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుంటుంది. ఈ ప్రాంతంలో శీతాకాలం తీవ్రంగా వుండి మంచు కోత కలిగిస్తాయి. ఈ సమయంలో ఇక్కడ భారీగా మంచు కురుస్తుంది, ఉష్ణోగ్రతలు -28 డిగ్రీల దాకా పడిపోతుంది.