Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లుధియానా » వాతావరణం

లుధియానా వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు లుధియానా ను సందర్శించడం ఉత్తమం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ అందమైన నగరాన్ని సందర్శించడానికి అనువుగా ఉంటుంది.

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూన్ వరకు): మే, జూన్ అత్యధిక వేడి ఉండే వేసవి కాలాలు. వేడి, పొడి వేసవి సమయంలో, ఉష్ణోగ్రత 35 నుండి 42 డిగ్రీల మధ్యలో ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): వర్షాకాలం జులై లో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. గడిచిన వేసవితో పోల్చుకుంటే ఈ సమయంలో చల్లదనం పెరగటంతోపాటు సాధారణ ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి మార్చ్ వరకు): అక్టోబర్, నవంబర్ పొడిగా ఉంటుంది, అయితే నవంబర్ కొంచెం చల్లగా ఉంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో వెచ్చటి పగలు, చల్లటి రాత్రులు ఉంటాయి.