మిజోరాం లో ని రెండవ అతి పెద్ద నగరం లుంగ్లీ. ఇది రాష్ట్రానికి దక్షిణ ప్రాంతం లో ఉంది. లుంగ్లీ ని 'రాతి వంతెన అని అర్ధం వచ్చేటట్టుగా' లంగ్లీ అని కూడా అంటారు. త్లవంగ్ అనే నది కి ఉపనది అయిన నఘసిహ్ వద్ద వంతెన లా ఒక రాయి కనపడింది. ఈ రాయి వలెనే ఈ ప్రాంతానికి లుంగ్లీ అనే పేరు వచ్చింది.
చుట్టూ అబ్బుర పరిచే ప్రకృతి అందాలతో లుంగ్లీ పట్టణం దీవించబడినది. ఏడాది పొడవునా ప్రపంచ నలు మూలల నుండి పర్యాటకులు ఈ ప్రాంతానికి విచ్చేసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.
జోబాక్ స్పోర్ట్స్ అకాడెమి, ఖాంజావి పార్క్, ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ, సైకుతి హాల్(స్థానిక చిత్రకారుల గాలెరి తో పాటు ఈవెంట్స్ మరియు కొన్ని రకాల ప్రదర్శనల కోసం ఏర్పాటయిన హాల్), మరియు తాంలుయియా ముయల్ (ఫుట్ బాల్ స్టేడియం) లు ఇక్కడున్న ప్రసిద్ద పర్యాటక ఆకర్షణలలో కొన్ని. సాహసోపేతమైన ట్రెక్స్ కి అలాగే పిక్నిక్ స్పాట్స్ కి లుంగ్లీ ప్రసిద్ది చెందినది.



Click it and Unblock the Notifications