Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలంపూజ » వాతావరణం

మలంపూజ వాతావరణం

బెస్ట్ సీజన్ మలంపూజ ప్రదేశాన్ని సందర్శించేదుకు శీతాకాలం అనుకూలమైనది. లేదా వర్షా కాలం లో అంటే ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో కూడా పర్యటించవచ్చు. ఈ సమయం లో కేరళ లో ప్రధాన పండుగ అయిన ఓనం ఉంటుంది. పండుగ సందడి కోరే వారికి ఇది సరైన సమయం. కల్పాతి రథోత్సవం మరియు కాలపూట్టు చూడాలనుకునే వారికి నవంబర్ మరియు జనవరి నెలలు సూచించ దగినది.

వేసవి

వేసవి మలంపూజ లో వేసవులు అధిక వేడి. వేసవి మార్చ్ నెలలో మొదలై మే నెల చివరి వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ లు గా కూడా ఉంటాయి. మలంపూజ పర్యటనకు వేసవులు అనుకూలం కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం లో మలంపూజ అధిక వర్షాలు పొందుతుంది. వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ ఉంటుంది. అధిక వర్షాల కారణంగా ఈ కాలం లో పర్యటన సూచించ దగినది కాదు.

చలికాలం

  శీతాకాలం మలంపూజ లో శీతాకాలం చాల ఆహ్లాదంగా వుంటుంది. చలికాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ ఉంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుండి 32 డిగ్రీల వరకూ మారుతూంటాయి. ఇది పర్యటనకు అనుకూలం అయిన కాలం.