Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలానా » వాతావరణం

మలానా వాతావరణం

సందర్శన కు ఉత్తమ సమయం: మలానా పర్యటించడానికి అనువైన సమయం, వేసవి. ఈ సమయంలో ఈ ప్రాంత ఉష్ణోగ్రత ఆహ్లాదకరంగా మరియు సందర్శనకు సముచితంగా ఉంటుంది.

వేసవి

మలానా యొక్క నాలుగు ప్రధాన కాలాలు వేసవి, వర్షాకాలం, శీతాకాలం మరియు వసంతకాలం.వేసవి (ఏప్రిల్ నుండి జూన్): ఏప్రిల్ నెల మలానా లో వేసవి యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఈ ప్రాంత ఉష్ణోగ్రత 10° సెం. మరియు 20° సెం. ల మధ్య ఉంటుంది. ఈ సమయంలో మలానా ఉష్ణోగ్రత రాత్రి పడిపోతుంది కనుక, యాత్రికులు తేలికపాటి శీతాకాలపు దుస్తులు తీసుకువెళ్లాలని సూచిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి ఆగష్టు): మలానా లో వర్షాకాలం జూలై లో వచ్చి, ఆగష్టు చివరి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో, ఈ ప్రాంతం మొత్తం పచ్చని ప్రకృతితో నిండి అందంగా ఉంటుంది. రహదారుల పరిస్థితి బాగానే ఉన్నట్లయితే యాత్రికులు, జూలై మరియు ఆగస్టు నెలలో మలానా సందర్శించవచ్చు.

చలికాలం

శీతాకాలం (నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు): శీతాకాలాలు, మలానా లో ఉష్ణోగ్రతలు 0° కంటే తగ్గవచ్చు. ఈ సమయంలో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 10° సెం. ఉంటుంది. వసంత కాలం (మార్చి): మార్చి నెల మలానా లో వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఈ ప్రాంత సగటు ఉష్ణోగ్రత సుమారు 15° సెం. ఉంటుంది.