Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » వాతావరణం

మనాలి వాతావరణం

ఉత్తమ సమయం మనాలి ని సందర్శించే పర్యాటకులు మార్చ్ నుండి జూన్ నెల వరకు సందర్శించడం ఉత్తమం. ఈ సమయం లో శీతాకాల ప్రభావాలు తక్కువ.  

వేసవి

ఎత్తైన ప్రాంతం అవడం వల్ల, మనాలి వాతావరణం ఏడాది లో ఎక్కువ శాతం చల్ల గా నే ఉంటుంది. ఎండాకాలం లో ఈ ప్రాంత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం లో మాత్రం వాతావరణం చల్లగా ఉండడంతో పాటు భారీ గా మంచువర్షం కురుస్తుంది. వర్షాకాలం లో భారీ వర్షపాతాల కారణం గా రోడ్లు పాడవడం అలాగే నేల జారుగా ఉండడం వల్ల ఈ సమయం లో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించక పోవడం ఉత్తమం.ఎండాకాలం (మార్చ్ టు జూన్): మనాలి లో మార్చ్ లో మొదలయ్యే ఎండాకాలం జూన్ నెల వరకు కొనసాగుతుంది. ఎండాకాలం లో 10 డిగ్రీల సెల్సియస్ వరకు మనాలి లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత. ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. పగటి పూట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం అయ్యే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది.  

వర్షాకాలం

వర్షాకాలం (జూలై టు సెప్టెంబర్): జూలై లో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ చివర వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించక పోవడం ఉత్తమం. ఎందుకంటే నేల జారుగా ఉండడం తో పాటూ రోడ్లు కూడా పాడయి ఉంటాయి.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ టు ఫిబ్రవరి): అక్టోబర్ నెల లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఇక్కడ నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రత -7డిగ్రీల సెల్సియస్.