కోటకు సరిగ్గా దిగువ భాగంలో సెయింట్ జెరోమ్ చర్చి కలదు. ఈ చర్చిలో ప్రతి ఏటా ఫెస్టా దాస్ రీస్ మేగోస్ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు ప్రతి జనవరి 6వ తేదీన ఒక పండుగగా జరుగుతాయి. రీస్ మేగోస్ కోటను చూడాలంటే వేసవి మంచి సమయంగా భావించాలి.
రీస్ మేగోస్ కోట చేరుకొనటం తేలికగానే ఉంటుంది. కోట చిన్నదే కావటం చేత చూసేందుకు సమయం కూడా అధికంగా తీసుకోదు. పనాజిం, మార్గోవా మరియు వాస్కో లనుండి టూర్లు ఏర్పరుస్తారు. అక్కడకు వెళ్ళేందుకు ఒక గంట సమయం పడుతుంది. పనాజిం నుండి ప్రయాణ సమయం మరింత తక్కువే. మీరు కనుక నార్త్ గోవా, కండోలిం, బాగా మరియు కాలన్ గూటే లలో ఉండే వారైతే, ఈ కోటకు అద్దె క్యాబ్ లు లేదా అద్దె బైక్ లలో చేరటం సౌకర్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications