విమాన మార్గం ద్వారా : మెదక్ కు దగ్గరలోని విమానాశ్రయం హైదరాబాద్ లో ఉంది. ఇది మెదక్ పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం నుండి మెదక్ కు మీరు టాక్సీ పై చేరవచ్చు. 1500-2000 రూపాయల వరకు టాక్సీ చార్జీలు ఉంటాయి. హైదరాబాద్ నుండి మెదక్ పట్టణానికి బస్సులు ఉంటాయి, కాని మీరు ముందు విమానాశ్రయం నుండి బస్ స్టాండ్ కు చేరవలసి ఉంటుంది.