మొదట ఉన్నటువంటి ఉంగ్మా ఏయో గ్రామం నుండి ఈ గ్రామానికి ఏయోలు తరలి వచ్చినప్పటినుండి ఇది అతి ప్రాచీనమైన మరియు సాంప్రదాయక గ్రామంగా పేరుపొందింది. మొకొక్ అంటే అయిష్టం గా మరియు చంగ్ అంటే సంఘం అని అర్ధం. దీని అంతరార్ధం అయిష్టంగా తమ నిజ నివాసం నుండి కదిలి వెళ్ళిన జన సమూహంగా చెప్పవచ్చు. నాగాలాండ్ లోని ఇతర తెగల వలె వీరికి కూడా పండుగలు ప్రక్రుతి మరియు పంటల చుట్టూ ముడి వేసుకుని ఉన్నాయి.
మొత్సు పండుగ ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుని తలచుకుంటూ వ్యవసాయ అభివృద్ధి కోసం జరుపుకుంటారు. ఆగస్ట్ యొక్క మొదటి వారం లో జరుపుకునే త్సుంగ్రెమొంగ్ పండుగ పంట కోతల సమయంలో జరుపుకుంటారు. ఇక్కడి వారు క్రైస్తవ మతం లో కి మారటం వల్ల ఇక్కడ ఈ మతం ప్రాచుర్యంలో ఉంది. మొకొక్చుంగ్ నగరం నుండి ఈ గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications