ఈ జలపాతాలు ముస్సూరీ నుండి 7 కి.మీ.ల దూరంలో కలవు. ఇవి చాలా అందమైనవి. సమీపంలో ప్రసిద్ధి చెందిన సైట్ జార్జ్, ఓక్ గ్రోవ్ విన్ బెర్గ్ అల్లెన్ వంటి బోర్డింగ్ స్కూల్స్ కలవు. ప్రకృతి ప్రియులకు, సాహస క్రీడాకారులకు ఈ ప్రదేశం బాగుంటుంది. చుట్టూ వివిధ రకాల పూవులు, మొక్కలు, వనమూలికల చెట్ల తో శివాలిక్ పర్వత శ్రేణుల అందాలు ఈ ప్రదేశం నుండి చూడవచ్చు. ఈ వాటర్ ఫాల్ కు ఇరువైపులా ఒక వైపు వ్యవాసాయ భూములు మరోవైపు ప్రఖ్యాత దూన్ వాలీ కలవు. ఝారి పాణి గ్రామం నుండి జలపాతాలకు బస్సులు ఆటో రిక్షాలు నడుస్తాయి. గ్రామం నుండి 2 కి. మీ.ల దూరం నడచి కూడా వీటిని చేరవచ్చు.



Click it and Unblock the Notifications