Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ముత్తతి

ముత్తతి - కావేరీ నదీతీర అందాలు

11

ముత్తతి కర్నాటక లోని మంద్య జిల్లాలో ఒక గ్రామం. బెంగుళూరు నుండి ప్రయాణ సమయం 90 నిమిషాలు మాత్రమే. మన రామాయణంలో ఈ ప్రదేశాన్ని గురించిన వివరణ కూడా ఇవ్వబడింది. ఈ ప్రదేశంలో ఆంజనేయుడి దేవాలయం ప్రసిద్ధి. దీనినే హనుమంతరాయ దేవాలయం అని కూడా పిలుస్తారు.  

ముత్తతి గ్రామం ఎంతో ముచ్చటగా కనపడుతుంది. కావేరి నది ఈ గ్రామంలోని కొండరాతి ప్రదేశం ద్వారా ప్రవహిస్తుంది. చుట్టూ కొండలు, దట్టమైన అడవులతో ప్రకృతి అందాలను దర్శించి ఆనందించేవారికి తమ కలలు నిజమైనట్లు అనిపిస్తుంది. ఈ ప్రదేశంలోని కావేరి ప్రవాహంలో  నావలలో ప్రయాణించవచ్చు.

ముత్తతి కావేరి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కి సమీపంలో ఉంది. అన్నీ అడవులే. కొండల మధ్య లోయలు, నదీ ప్రవాహాలు కలిగిన ఈ ప్రదేశంలో వివిధ రకాల వన్య ప్రాణులను అంటే పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, అడవి ఎద్దు, మొదలైనవి చూసి ఆనందించవచ్చు.  ముత్తతి భీమేశ్వరికి సమీపంలో ఉంది. ట్రెక్కింగ్ లో  మనోహర సుందర అందాలను కన్నుల పండువుగా ఆనందించవచ్చు.

వాస్తవానికి ఇపుడు ఈ ప్రదేశం ట్రెక్కింగ్ చేసేవారికి స్వర్గంగా మారిపోతోంది. దట్టమైన ఈ అడవులలో ట్రెక్కింగ్ చేయాలంటే, ముందుగా అటవీ శాఖ అనుమతి పొందాలి. ముత్తి సమీపంలోని సొలిగెరె హిల్ సముద్ర మట్టానికి 1125 మీటర్ల ఎత్తులో ఉండి దానిపైకి అధిరోహించిన వారికి చుట్టు పట్ల ప్రాంతాలను ఎంతో మనోహరంగా చూపిస్తుంది. ఇక్కడి అడవి నుండి ట్రెక్కింగ్ లో భీమేశ్వరి, సంగమా ప్రదేశాలను కూడా చేరవచ్చు.

ఈ ప్రదేశాన్ని బెంగుళూరు నివాసితులు, తరచుగా సందర్శించి అక్కడి మనోహర సుందర దృశ్యాలను ఆనందిస్తారు. బెంగుళూరు నగర ప్రజలకు వారంతపు సెలవుల విశ్రాంతి ప్రదేశంగా కూడా అనుకూలమే. 

ముత్తతి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ముత్తతి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ముత్తతి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ముత్తతి

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ మరియు ప్రయివేటు బస్సులు బెంగుళూరు నుండి సాతనూరు వరకు నడుస్తాయి. అక్కడినుండి పర్యాటకులు ముత్తతికి ప్రయివేటు బస్సులు లేదా క్యాబ్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ముత్తతికి రైలు స్టేషన్ లేదు. ముత్తతికి సమీపంలో బెంగుళూరు సిటీ జంక్షన్ కలదు. ఇది సుమారు 96 కి.మీ.లు. బెంగుళూరు మెజస్టిక్ రైలు స్టేషన్ నుండి దేశంలోని ముంబై, చెన్నై, కోల్కటా, ఢిల్లీ వంటి నగరాలకు రైళ్ళు కలవు. ఈ రైలు స్టేషన్ నుండి పర్యాటకులు టాక్సీలు, క్యాబ్ లలో లేదా ప్రభుత్వ బస్సులలో కూడా ముత్తతి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ముత్తతి కి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 114 కి.మీ. లదూరంలో కలదు. దేశీయ మరియు విదేశీయ పర్యాటకులకు ఈ విమానాశ్రయం అందుబాటులో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
14 Jun,Sun
Return On
15 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
14 Jun,Sun
Check Out
15 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
14 Jun,Sun
Return On
15 Jun,Mon

Near by City