ఏటా వేలాది మంది యాత్రికులను ఆకర్షించే దీక్షా భూమి నాగపూర్ లోని బౌద్ధులకు పవిత్ర స్థలం. 120 అడుగుల పొడవుండే బౌద్ధ స్తూపాలకు నెలవు ఈ ప్రదేశ౦.డాక్టర్ BR అంబేద్కర్ స్ఫూర్తి తో వందలాది మంది దళితులూ బౌద్ధంలోకి మారడం ఈ ప్రదేశంలో మరపురాని సంఘటన. వారి జ్ఞాపకార్ధం ఈ రోజును అశోక విజయ దశమిగా జరుపుకుంటారు.ఇక్కడి యాత్రిక కేంద్రం 5000 కన్నా ఎక్కువ మందికి వసతి ఇవ్వగలదు. ఈ అద్భుత కట్టడం గొప్ప చరిత్ర కలిగి, జాతీయ సమైక్యతకు ఆనవాలుగా నిలుస్తుంది.



Click it and Unblock the Notifications