సిక్కుల సాంప్రదాయానికి చిహ్నం.. హోలా మొహల్లా ఫెస్టివల్
మన దేశంలో అనేక సంస్కృతులు, సంప్రదాయాలూ నిత్యం మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఏటా ఏదో ఒక సందర్భంలో విభిన్న రకాలైన పండగలు జరుగుతూనే ఉంటాయి. అలా ఈ సీజన్‌లో జరుపుకొంటోన్న మరో పండగ హోలా మొహల్లా. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా మార్చిలో హోలా మొహల్లా పండుగను నిర్వహిస్తున్నారు. మార్చి 8న ప్రారంభమయ్యే ఈ ఉత్సవం మార్చి 10 వరకు కొనసాగనుంది. హోలా మొహల్లా పండుగ సిక్కుల పండుగ.
సందర్శకులకు మార్చి నెల ప్రయాణానికి అనువైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో, వసంత ఋతువు మధ్య దశలోనే ఉంటుంది. దీని తరువాత, వేసవి కాలం. అంటే ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. దీంతో ఆ వేసవి తాపానికి దొరక్కుండా ఉండేందుకు, విహారానికి అనువుగా ఉంటుంది. పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సెలవులకు వెళతారు. ఈ ఏడాది మార్చి నెలలో హోలా మొహల్లా పండుగ కూడా నిర్వహిస్తున్నారు కనుక మీరు పంజాబ్ చుట్టూ విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, హోలా మొహల్లా ఫెస్టివల్‌ని చూడగలరు. అయితే, బయలుదేరే ముందు, ఈ ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోండి.

హోలా మొహల్లా పండుగ ఎప్పుడు?
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మార్చిలో హోలా మొహల్లా పండుగను నిర్వహిస్తున్నారు. మార్చి 8న ప్రారంభమయ్యే ఈ ఉత్సవం మార్చి 10 వరకు కొనసాగనుంది. హోలా మొహల్లా పండుగ సిక్కుల పండుగ. ఈ సందర్భంగా, మీరు సిక్కు సమాజం యొక్క నాగరికత, సంస్కృతితోపాటు వారిపట్ల మరింత గౌరవాన్ని పెంచుకునేలా ఉంటుంది ఈ పరిచయం. మీరు పంజాబీ రుచులను కూడా రుచి చూడవచ్చు. వారు అందించే వంటకాల రుచులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. మీ స్నేహితులు లేదా కుటంబసభ్యులతో హోలా మొహల్లా చూడటానికి వెళ్ళవచ్చు.

హోలా మొహల్లా పండుగ ఎక్కడ?
పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ పంజాబ్‌లోని రూపనగర్‌లో ఉంది. రోడ్డు మార్గంలో చండీగఢ్ మీదుగా ఆనందపూర్ సాహిబ్ చేరుకోవచ్చు. అయితే, సమీప రైల్వే స్టేషన్ నంగల్ మరియు విమానాశ్రయం ఆనందపూర్ సాహిబ్. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఏటా ఈ సీజన్ వచ్చిందంటే దేశ విదేశీ సందర్శకులతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది.

హోలా మొహల్లా ప్రత్యేకత ఏమిటి
హోలా మొహల్లా పండుగను సిక్కు మతం యొక్క పదవ గురువు గురు గోవింద్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జరుపుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా పంజాబీలు మత గురువులకు ఇస్తోన్న గౌరవానికి చిహ్నంగా ఈ ఫెస్టివల్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా పలు సంప్రదాయక బొమ్మలను ప్రదర్శనకు ఉంచుతారు. పంజాబీ కుటంబీకులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. పిల్లలను ఎంతగానో ఆకర్షించే అనేక కళాకృతులు ఇక్కడ కనిపిస్తాయి. సాయంత్రపు సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. హోలా మొహల్లా పండుగ నాగర్ కీర్తనతో ప్రారంభమవుతుంది. ఈ కీర్తనను పంజ్ ప్యారే అందిస్తారు. మరెందుకు ఆలస్యం మీరూ కుటుంబసమేతంగా పంజాబ్ ప్రయాణానికి బలుదేరండి!



Click it and Unblock the Notifications












