Search
 • Follow NativePlanet
Share

పంజాబ్ పర్యటన –వినోదం, పండుగలు, ఆహరంతో కూడిన సారవంతమైన భూమి!  

పంజాబ్, భారతదేశానికి వాయువ్యం లో ఉంది, ఇది పశ్చిమాన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ&కాశ్మీర్, హర్యానా, రాజస్తాన్, పాకిస్తాన్ తో చుట్టబడి ఉంది. దేశంలోని అతిచిన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉండడం వల్ల, పంజాబ్ సంపదలో నైపుణ్యాన్ని కలిగిఉంది. 1947 లో బ్రిటీషు వాళ్ళు పంజాబ్ ని భారతదేశం, పాకిస్తాన్ నుండి విడగొట్టిన తరువాత, తిరిగి పంజాబ్ 1966 లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా గా విభజించబడింది. ఇది తిరిగి గ్రీకులు, ఆఫ్ఘన్లు, ఇరానియన్లు, కేంద్ర ఆసియా వారికి ప్రవేశద్వారంగా ఉంది. పంజాబ్, గ్రీకులు, జోరాస్ట్రియన్ లకు ఒక చారిత్రిక గుర్తింపుగా పేర్కొనబడింది.

పంజాబ్ ఐదు నదుల కూడలి గల భూమిగా వారు సూచించారు. అందువల్ల ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. పంజాబ్ ఎక్కువగా సిక్కింమత అనుచరులు కనిపించే ప్రదేశం. ఇక్కడ యంత్ర పరికరాలు, వస్త్రాలు, కుట్టు యంత్రాలు, క్రీడా సామగ్రి, గంజిపొడి, పర్యటన, సారవంతమైన భూమి, సైకిళ్ళు, పంచదార, వస్త్రాలు వంటి ఇతర పరిశ్రమలు కూడా ఉన్నాయి. పంజాబ్ వ్యవసాయ సామగ్రి, సాంకేతిక వస్తువులు, విద్యుత్ పరికరాలను కూడా తయారుచేస్తుంది. పంజాబ్ – వాతావరణం, భూగోళ శాస్త్రం, వన్యప్రాణులు పంజాబ్ నీటిపారుదల కాలువలపై ఆధారపడిన సారవంతమైన ఒండ్రు మట్టిని కలిగిఉంది. రాష్ట్రంలోని ఉత్తర భాగం హిమాలయాల దిగువ భాగంలో ఉంటే, దక్షిణ భాగం థార్ ఎదారితో కలిసిఉంది. పంజాబ్ వీడి వేసవితో, చల్లని శీతాకాలాలతో అధిక వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది. వర్షాకాల సమయంలో భారీ వర్షపాతం ఉంటుంది.

దేశంలోని ఈ ప్రాంతంలో సహజ అడవులు లేవు. నారింజ, దానిమ్మ, ఆపిల్, పీచ్, అత్తి, మల్బరీ, నేరేడు పండు, బాదం, ప్లం వంటి పండ్లను ఇక్కడ పండిస్తారు. ఇక్కడి భూమి పొదలు, గడ్డి, మొక్కలతో కప్పబడి ఉంటాయి. పంజాబ్ లో భారతదేశంలోని అత్యుత్తమ మౌలిక వసతులు ఉన్నాయి. గోధుమ, వారి, చెరుకు, కూరగాయలు లాంటి పంటలు పండించే పంజాబ్ ని “భారతదేశ ధాన్యాగారం” అంటారు. ఇక్కడి జలాలలో మొసళ్ళు సాధారణంగా కనపడతాయి. పట్టుపురుగులు, తేనెటీగలు ఎక్కువగా పెంచుతారు. అలాగే గుర్రాలు, ఒంటెలు, గేదెలను కూడా పెంచుతారు. పంజాబ్ పర్యటనలో అనేక ఇతర జాతుల క్షీరదాలను కూడా చూడవచ్చు. పంజాబ్ పర్యటన పంజాబ్ నగరానికి చండీగర్ రాజధాని, భారతదేశంలోని ప్రనాళికాబద్ధ నగరాలలో ఒకటి. ఇక్కడి సంస్కృతి, నాగరికత పర్యాటకులను ఆసక్తి కలిగించేటట్లు ఉంటుంది. అద్భుతమైన భవనాలు, ఆలయాలు, మందిరాలు, చారిత్రిక యుద్ధాలతో ఈ ప్రాంతం పర్యటనకు సరైన ఎంపిక. ఫరీద్కోట్, జలంధర్, కపుర్తాల, లుధియానా, పఠాన్కోట్, పటియాల, మొహలి, మొదలైనవి వారి అందం, గంభీరంతో కూడిన వివిధ నగరాలూ ఉన్నాయి. ప్రతి స్థలం గొప్పతనాన్ని అందించే ఏదోఒక ప్రత్యేక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలు పంజాబ్ పర్యటనలో ప్రధాన విషయాలు. గోవింద్గర్ ఫోర్ట్, కిల ముబారక్, షీష్ మహల్, ఒకప్పటి పాలకుల సంప్రదాయ స్థాయిని ప్రతిబింబించే జగత్జిట్ భవనం వంటి వివిధ కోటలు ఉన్నాయి. అత్తరి సరిహద్దు, ఆమ్ ఖాస్ బాగ్, బారాదరి తోటలు, తఖట్-ఇ-అక్బరి, జలియన్వాల బాగ్, రుజ షరీఫ్ వంటివి కొన్ని పేరుగాంచిన స్మారకలు. ప్రభుత్వ మ్యూజియం, ఆర్ట్ గాలరీ, షహీద్-ఇ-అజాం, సర్దార్ భగత్ సింగ్ మ్యూజియం, పుష్ప గుజ్రాల్ వైజ్ఞానిక నగరం, మహారాజ రంజిత్ సింగ్ మ్యూజియం వంటి కొన్ని అందమైన మ్యూజియంలు స్మారకచిహ్నాలను భద్రపరచిన సందర్శనకు విలువైన మ్యూజియంలు. డేరా సన్త్గర్హ, గురుద్వారా గార్న సాహిబ్, గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్, గురుద్వారా శాహిద్గంజ్ తల్వండి జత్తన్ మొదలైనవి రాష్ట్రంలోని ప్రతి జిల్లలో ఎక్కువగా కనిపించే అనేక ఇతర గురుద్వారాలు.

శ్రీ రామ్ తీర్థ ఆలయం, దుర్గియన ఆలయం, శివాలయం, కత్గర్, కామాహి దేవి ఆలయం, దేవి చెరువు మందిరం వంటివి కొన్ని హిందువుల ధార్మిక ప్రదేశాలు. మూరిష్ మసీదు పంజాబ్ లో నివశించే ముస్లింల పవిత్ర స్థలం. సంఘోల్, పురావస్తు మ్యూజియం, రూప్ నగర్ వంటివి కొన్ని పంజాబ్ పర్యటనలో విభిన్న దృక్కోణం కలిగిన పురావస్తు ప్రదేశాలు. చ్చాత్బిర్ జూ, తఖ్ని-రేహ్మపూర్ వన్యప్రాణుల అభయారణ్యం, కంజలి వెట్ లాండ్, హరికే తడిభూమి, టైగర్ సఫారీ, జింకల పార్కు మొదలైనవి రాష్ట్ర అందాన్ని పెంపొందించే పంజాబ్ లోని వన్యప్రాణుల అభయారణ్యాలు. పంజాబ్ – ప్రజలు, సంస్కృతి పంజాబ్ పర్యటన, పంజాబ్ సంస్కృతి, సంప్రదాయాలను చూసే అవకాశం ఇస్తుంది. ఇక్కడ నివశించే వారు సిక్కు మతాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. అమ్రిత్సర్ లోని స్వర్ణ దేవాలయం సిక్కులకు పవిత్ర మందిరం. పంజాబ్ లోని ప్రతి గ్రామంలో గురుద్వారాలు కనిపిస్తాయి.

ఇక్కడ అనుసరించే రెండవ మతం హిందూమతం. పంజాబ్ లో వ్యావహారిక భాష పంజాబీ. ఇక్కడ నివసించే ప్రజలు ఉల్లాసంగా, వివిధ సాంస్కృతిక కార్యకలాపాలతో జీవితాన్ని ఆనందిస్తారు. నృత్యంతో కూడిన సంగీతం, వివిధ వంటకాలు ఇక్కడి సాధారణ దృష్టికోణం. లోహరి, వసంత, వైశాఖి, తీజ్ అనేవి పంజాబ్ లోని కొన్ని పండుగలు. భాంగ్రా, పంజాబ్ లోని ప్రసిద్ధ నృత్య రూపకం. ఇది ప్రారంభంలో నూర్పిళ్ళ నృత్య రూపకం, కానీ ఇది క్రమంగా ప్రపంచ ప్రసిద్ది పొందింది. చరిత్ర గురించి చెప్పే జానపద రూపాలు కూడా పంజాబ్ లో ప్రసిద్ది పొందాయి.

 

పంజాబ్ ప్రదేశములు

 • నవన్సహర్ 26
 • మొహాలి 21
 • గురుదాస్పూర్ 18
 • సంగ్రూర్ 13
 • ఫరీద్కోట్ 13
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Oct,Sat
Return On
24 Oct,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
23 Oct,Sat
Check Out
24 Oct,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
23 Oct,Sat
Return On
24 Oct,Sun