Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఈనెల 15 నుంచి 18వ‌ర‌కు ప‌లు రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు..

ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఈనెల 15 నుంచి 18వ‌ర‌కు ప‌లు రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు..

రైలు ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. అక్టోబర్ 15వ తేది నుంచి విశాఖపట్నం వెళ్లే పలు రైళ్లు గమ్యస్థానం చేరే సమయాల్లో మార్పులు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈమార్పులు ఈ నెల 15 వ‌తేది నుంచి 18వ తేది వరకు ఉండ‌నున్న‌ట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ చేరుకునే ప‌లు రైళ్ల గమ్యస్థానంలో మార్పులు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్ర‌యాణికుల‌కు ఈ మార్పులను గ‌మ‌నించాల‌ని అధికారులు కోరారు.

20806 అనే నెంబ‌ర్‌గ‌ల న్యూఢిల్లీ టు విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ నెల‌ 15వ తేదీ నుంచి విశాఖకు తెల్లవారుజామున‌ 4.10 గంటలకు బదులుగా 4.20 గంటలకు చేరుకుంటుంది.

22848 అనే నెంబ‌ర్‌గ‌ల లోకమాన్యతిలక్‌ టెర్మినస్‌-విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ ఈ నెల అక్టోబర్ 22 నుంచి తెల్లవారు 5 గంటలకు బదులుగా 5.10 గంటలకు చేరుకుంటుంది.

12728 అనే నెంబ‌ర్‌గ‌ల హైదరాబాద్ టు విశాఖపట్నం గోదావరి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 15 నుంచి తెల్లవారు 5.45 గంటలకు బదులుగా 5.55 గంటలకు విశాఖ‌కు చేరుకుంటుంది.

trains

18517 అనే నెంబ‌ర్‌గ‌ల కోర్బా టు విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అక్టోబర్ 15 నుంచి ఉదయం 6.25 గంటలకు బదులుగా 6.40 గంటలకు చేరుకుంటుంది.

12740 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు విశాఖపట్నం గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్ 15వ తేది నుంచి ఉదయం 7.40 గంటలకు బదులుగా 7.50 గంటలకు విశాఖ‌కు చేరుకుంటుంది.

17219 అనే నెంబ‌ర్‌గ‌ల మచిలీపట్నం టు విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 15 నుంచి ఉదయం 8.10 గంటలకు బదులుగా 8.20 గంటలకు విశాఖ‌కు చేరుకుంటుంది.

20812 అనే నెంబ‌ర్‌గ‌ల నాందేడ్ టు విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 20వ తేది నుంచి ఉదయం 9.10 గంటలకు బదులుగా 9.20 గంటలకు విశాఖ‌కు చేరుకుంటుంది.

08531 అనే నెంబ‌ర్‌గ‌ల బ్ర‌హ్మపూర్ టు విశాఖపట్నం పాసింజర్‌ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 15వ తేది నుంచి ఉదయం 9.20 గంటలకు బదులుగా 9.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

17267 అనే నెంబ‌ర్‌గ‌ల కాకినాడ పోర్ట్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ అక్టోబర్ 15 నుంచి ఉదయం 9.30 గంటలకు బదులుగా 9.40 గంటలకు చేరుకుంటుంది.

18574 అనే నెంబ‌ర్‌గ‌ల భగత్‌ కి కోటి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ అక్టోబర్ 19 నుంచి ఉదయం 9.50 గంటలకు బదులుగా 10 గంటలకు చేరుకుంటుంది.

08503 అనే నెంబ‌ర్‌గ‌ల భవానిపట్న టు విశాఖపట్నం పాసింజర్‌ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 15 నుంచి ఉదయం 10 గంటలకు బదులుగా 10.10 గంటలకు చేరుకుంటుంది.

20804 అనే నెంబ‌ర్‌గ‌ల గాంధీదాం టు విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్ 15వ తేది నుంచి ఉదయం 10.10 గంటలకు బదులుగా 10.20 గంటలకు చేరుకుంటుంది.

trainstimings changed

ఈ నెల 15వ తేది నుంచి దుర్గ్ టు విశాఖపట్నం (18529) ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 10.20 గంటలకు బదులుగా 10.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

22708 అనే నెంబ‌ర్‌గ‌ల తిరుపతి టు విశాఖపట్నం డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ అక్టోబర్ 20 నుంచి ఉదయం 10.30 గంటలకు బదులుగా 10.40 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

18520 అనేన నెంబ‌ర్‌గ‌ల లోకమాన్యతిలక్‌ టెర్మినస్‌-విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 15వ తేది నుంచి ఉదయం 10.40 గంటలకు బదులుగా 10.50 గంటలకు చేరుకుంటుంది. ఈనెల 20 నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌-విశాఖపట్నం (12804) స్వర్ణజయంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా 2.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

ఈ నెల‌ 15 వ తేదినుంచి రాయ్‌పూర్ టు విశాఖపట్నం (08527) పాసింజర్‌ స్పెషల్‌ రాత్రి 6.40 గంటలకు బదులుగా 7 గంటలకు చేరుకుంటుంది.
08552 అనే నెంబ‌ర్‌గ‌ల కిరండూల్‌-విశాఖపట్నం పాసింజర్‌ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 15 నుంచి రాత్రి 8.20 గంటలకు బదులుగా 8.45 గంటలకు చేరుకుంటుంది.

08521 అనే నెంబ‌ర్‌గ‌ల గుణుపూర్ టు విశాఖపట్నం పాసింజర్‌ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 15వ తేది నుంచి రాత్రి 8.45 గంటలకు బదులుగా 9 గంటలకు చేరుకుంటుంది.

20834 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్ 15 నుంచి రాత్రి 11.31 గంటలకు బదులుగా 11.35 గంటలకు చేరుకుంటుంది.

18568 అనే నెంబ‌ర్‌గ‌ల కొల్లాం టు విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్ 18 నుంచి రాత్రి 11.40 గంటలకు బదులుగా 11.45 గంటలకు చేరుకుంటుంది.

More News

Read more about: train timings visakhapatnam news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+