Search
  • Follow NativePlanet
Share
» »తిరుమ‌ల భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. సెప్టెంబ‌ర్ నెల టికెట్ల కోటా షెడ్యూల్ విడుద‌ల‌..

తిరుమ‌ల భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. సెప్టెంబ‌ర్ నెల టికెట్ల కోటా షెడ్యూల్ విడుద‌ల‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అందులో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఎంతో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. ఏడుకొండ‌ల‌పై వెల‌సిన ఆ స్వామివారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటారు. టీటీడీ సెప్టెంబ‌ర్ నెల‌కు సంబంధించిన పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించిన టికెట్లను ముందుగానే ఆన్​లైన్​లో విడుదల చేస్తూ వస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సెప్టెంబర్​ నెలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్ర‌క‌టించేసింది.

ఈ నెల 18వ తేదీన సెప్టెంబ‌ర్ నెల‌కు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను విడుద‌ల చేయ‌నున్నారు. ఉదయం 10 గంట‌ల‌కు ఆన్​లైన్​లో టిక్కెట్లు విడుదల కానున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్రకటించింది. అలాగే, ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్​ 18వ తేదీ ఉదయం 10 నుంచి జూన్​ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.

లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులకు నగదు చెల్లించిన తరువాత ఆర్జిత సేవల టికెట్లు ఖరారు అవుతాయని పేర్కొంది. వీటితో పాటు ఈ నెల 21వ తేదీన వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఉద‌యం 10 గంటల నుంచి భక్తులకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు తెలిపారు. ఇవే కాకుండా, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్​ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.

tirumalaticketquota released

స్పెష‌ల్ ద‌ర్శ‌న టిక్కెట్లు..

జూన్ 22వ తేది ఉద‌యం ప‌ది గంట‌ల‌కు సెప్టెంబర్​ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వీటితోపాటు శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జూన్​ 22న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇవే కాకుండా.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు స్వామిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 22వ తేది మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

జూన్‌ 24న ఉదయం 10 గంటలకు స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీటీడీ తెలిపింది. వీటితో పాటు తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్​ నెలకు సంబంధించి గదులను కూడా అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

జులై నెలకు సంబంధించిన టికెట్లు..

జూలై నెల‌కు సంబంధించిన టిక్కెట్ల‌ను కూడా జూన్ 24న ఉదయం 10 గంటలకు విడుద‌ల చేయ‌నున్నారు. వీటితో పాటు అదేరోజు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.200 దర్శన టికెట్లు)టిక్కెట్లను కూడా రీలీజ్ చేయ‌నున్నారు. అంతేకాకుండా..జూన్ 25న ఉద‌యం ప‌ది గంట‌ల‌కు జులైలో స్థానిక ఆలయాల సేవా కోటా బుకింగ్ టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

వీటిపూర్తి వివ‌రాల‌కోసం భ‌క్తులు దేవస్థానం వెబ్​సైట్​ https://ttdevasthanams.ap.gov.in ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. టిక్కెట్లు బుక్ చేసుకోవాల‌నుకునే వారు కూడా ఈ వెబ్‌సైట్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోగ‌ల‌రు.

More News

    Read more about: tirumala andhrapradesh news
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+