Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌ : ఏపీలో మ‌రో మూడు రోజుల పాటూ వ‌ర్షాలు... ఐఎండీ హెచ్చ‌రిక‌లు!

ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌ : ఏపీలో మ‌రో మూడు రోజుల పాటూ వ‌ర్షాలు... ఐఎండీ హెచ్చ‌రిక‌లు!

ఏపీలోని ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఈ స‌మ‌యంలో వెకేష‌న్‌కి ప్లాన్ చేసేవారు కాస్త ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి మీమీ ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకుంటేనే మంచిది. రాష్ట్రంలోమ‌రో మూడు రోజులు పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఐఎండీ సూచనల మేర‌కు, బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని మే 24కు అంటే నేటికి అది వాయుగుండంగా మారి,

మే 25వ తేదీకి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివ‌రించారు. సాయంత్రానికి బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుంద‌ని, ప్రస్తుతానికి దీని వలన రాష్ట్రానికి ఎటువంటి ముప్పులేదని అధికారులు అంటున్నారు. దీని ప్ర‌భావంతో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో శని, ఆదివారాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బ‌ల‌ప‌డి ఇవాళ వాయుగుండంగా మార‌నుంది. దీంతో ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు ప‌డ‌నున్నాయి. శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారుతుందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంటున్నారు. ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఆదివారం సాయంత్రం బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటుతుందని ఐఎండీ భావిస్తోంది.

rainsforthreemoredaysinap1

దీని కార‌ణంగా ఆది, సోమవారాల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మిజోరం, మణిపూర్, త్రిపురలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ భావిస్తోంది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ ప్రభుత్వాలు అలర్ట్‌గా ఉండాలని ఐఎండీ హెచ్చ‌రిస్తోంది. ఇక‌, ఏపీ విషయానికి వస్తే, తీవ్ర తుఫాన్ కార‌ణంగా అక్క‌డ‌క్క‌డ తేలికపాటి వర్షాలు ప‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. భారీ వర్షాలు పడే అవ‌కాశం లేద‌ని అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో నేడు అక్కడక్కడ చెదురుమదురు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది.

ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు..

తుఫాన్ కార‌ణంగా నేడు రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వీటితోపాటు అరేబియా సముద్రంలో కేరళకు ఆనుకుని ఆగ్నేయంగా మరో అల్పపీడనం ఏర్పడింది.

దీని కార‌ణంగా కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ వచ్చినా సరే రుతుపవనాల రాక మాత్రం ఆలస్యం కాదని అధికారులు తెలుపుతున్నారు. ఈ నెలాఖరు కచ్చితంగా రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటు నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా చురుగ్గా కదులుతున్నాయని అంటున్నారు. అరేబియా సముద్రం, మాల్దీవులు సహా పరిసర ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+