Search
  • Follow NativePlanet
Share
» »తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల షెడ్యూల్ విడుద‌ల‌..

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల షెడ్యూల్ విడుద‌ల‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రం తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌స్తుంటారు. స్వామివారికి మొక్కుల రూపంలో కానుక‌లు స‌మ‌ర్పించుకుంటారు. ఈ తిరుమల శ్రీవారి ఆల‌యంలో ప్ర‌తిఏటా సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వ‌హిస్తారు. ఇక‌, ఈ ఏడాది కూడా ఆ బ్ర‌హ్మోత్స‌వాల‌ షెడ్యూల్ ను టీటీడీ తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 4 వ తేది నుంచి 12 వరకు ఈ బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 నుంచి 1 గంట‌ల వ‌ర‌కు.. తిరిగి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది మధ్య వాహన సేవలు జ‌రుపుతారు.

స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు- వాహనసేవల షెడ్యూల్ ఇదే...

తిరుమలలో ప్రతి రోజూ పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంటుంది. ఇక‌, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆల‌యంలో సంవ‌త్స‌రం పొడ‌వునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక‌, ఇక్క‌డ సాధార‌ణ రోజుల్లోనే భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. పూజా కార్య‌క్ర‌మాల్లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆల‌యంలో జ‌రిగే పండుగలలో అతి ముఖ్యమైనది నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఈ బ్ర‌హ్మోత్స‌వాలు మొత్తం తొమ్మిది రోజులపాటు ఉంటాయి. ఇవి అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగుతాయి. శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబర్ 3వ తేదీన అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి.

brahmotsavala schedule announced

బ్రహ్మోత్సవాలు

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబర్ 4వ తేది శుక్రవారం సాయంత్రం 5:45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్వజారోహణ కార్య‌క్ర‌మం ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం నిర్వ‌హిస్తారు. ఇక అక్టోబ‌ర్ 5వ తేది ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు సింహ వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం కార్య‌క్ర‌మం ఉంటుంది, ఆ త‌ర్వాత రాత్రి ముత్యపుపందిరిలో స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

మ‌రుస‌టి రోజు సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు కల్పవృక్షం సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒక‌టి నుంచి మూడు వరకు స్నపనం, తిరిగి రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు సర్వ భూపాల సేవ కార్య‌క్ర‌మం ఉంటుంది. మ‌రుసటి రోజు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారం, సాయంత్రం గ‌రుడ వాహన సేవ ఉంటుంది.ఇక‌, బుధవారం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం స‌మాయాల్లో స్వర్ణ రథం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గజవాహన సేవ ఉంటుంది.

ధ్వజావరోహణం..

అక్టోబర్ 10న (గురువారం) ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. అక్టోబర్ 11 శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రథోత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ ఉంటుంది. అక్టోబర్ 12న‌ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజావరోహణం కార్య‌క్ర‌మం ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+