Search
  • Follow NativePlanet
Share
» »Budget 2024: భార‌త్‌లోని ఈ ద్వీపాలు కూడా పర్యాటకానికి ఎంతో ప్ర‌త్యేకం...

Budget 2024: భార‌త్‌లోని ఈ ద్వీపాలు కూడా పర్యాటకానికి ఎంతో ప్ర‌త్యేకం...

భారతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్‌ను సమర్పించేట‌ప్ప‌డు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యాటకానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఇందులో పర్యాటకం కోసం లక్షద్వీప్‌లోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచేవిధంగా వారు నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. బడ్జెట్ సందర్భంగా, కేంద్ర ఆర్థిక మంత్రి లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పెట్టుబడులను ప్రకటించారు. మాల్దీవులతో వివాదం నుండి లక్షద్వీప్ వార్త‌ల్లో ఉండ‌డం మ‌నం చూస్తున్నాం. అయితే లక్షద్వీప్ కాకుండా, భార‌త్‌లో సంద‌ర్శించేందుకు ఇత‌ర అనేక ద్వీపాలు కూడా ఉన్నాయి. ఆ ప్రత్యేక దీవుల గురించి తెలుసుకుందాం.

డయ్యూ

భారతదేశపు పశ్చిమ భాగంలో ఉన్న డామన్ మరియు డయ్యూ ఒక కేంద్రపాలిత ప్రాంతం. డయ్యూ ద్వీపం విహారయాత్రకు గొప్ప ప్రదేశ‌మ‌ని చెప్పుకోవాలి. ఇక్కడ అందమైన బీచ్ వీక్షణలను చూడటమే కాకుండా అనేక ఆహ్లాదకరమైన కార్యకలాపాలను కూడా వీక్షించొచ్చు. పోర్చుగీస్ సంస్కృతి అవశేషాలను ప్రతిబింబిస్తూ, ఇక్కడ ఉన్న భవనాలు డయ్యూ చరిత్ర గురించి ప‌ర్యాట‌కుల‌కు తెలియజేస్తాయి. సెయింట్ పాల్ చర్చ్ నుండి 16వ శతాబ్దపు కోట వరకు, అన్నీ పోర్చుగీస్ నిర్మాణాల‌కు ప్ర‌తిబింబాలే. ఇక్కడ ఉన్న చారిత్రక వారసత్వాన్ని చూడ‌డంతో పాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, పారాగ్లైడింగ్, స్కూబా డైవింగ్, డాల్ఫిన్ ట్రిప్ మరియు పారాసైలింగ్ వంటి అడ్వంచ‌ర్ గేమ్స్‌లో కూడా పాల్గొన‌వ‌చ్చు.

diutravel1

చేరుకోవ‌డం ఎలా?

విమాన మార్గం ద్వారా ఇక్క‌డికి వెళ్లాలనుకుంటే సమీప విమానాశ్రయం డ‌య్యూ. రైల్వే మార్గం ద్వారా అయితే వెరెవల్‌కు సమీప రైల్వే స్టేషన్, డయ్యూ 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా అయితే, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ముంబైకు బ‌స్సులు అందుబాటులో ఉంటాయి.

అండమాన్ మరియు నికోబార్

అండమాన్ మరియు నికోబార్ దీవులు భారతదేశపు దక్షిణ భాగంలో ఉన్న ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ ద్వీపం అన్ని వైపుల నుండి అందంగా చుట్టుముట్టబడి ఉంటుంది. దీని కారణంగా ఇది గొప్ప పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో వన్యప్రాణులను చూడటమే కాకుండా అనేక ఇతర ఉత్తేజకరమైన కార్యకలాపాలు కూడా చేయవచ్చు. ట్రెక్కింగ్, జెట్ స్కీ రైడింగ్, స్కూబా డైవింగ్, సీకార్ట్, గేమ్ ఫిషింగ్ మొదలైన అనేక సాహసాలను ఇక్క‌డ చేయొచ్చు.

andamanandnicobar island

చేరుకోవ‌డం ఎలా?

విమాన మార్గం ద్వారా ఇక్క‌డికి వెళ్లాలనుకుంటే మాత్రం సమీప విమానాశ్ర‌యం వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది దాని రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో ఉంది. అంతే కాకుండా నీటి మార్గంలో కూడా ఇక్కడికి రావచ్చు. దీని కోసం ఫెర్రీ లేదా బోట్ ద్వారా చెన్నై, కోల్‌కతా లేదా విశాఖపట్నం కూడా వెళ్లవచ్చు.

ఎలిఫెంటా ద్వీపం

అరేబియా సముద్రంలో ఉన్న ఈ ద్వీపం యునెస్కో ప్రపంచ వారసత్వ విభాగంలో చేర్చబడింది. ఇది ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి చెందింది. ఇది ముంబై తీరానికి దాదాపు 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ గుహ‌లు శివునికి అంకితం చేయబడినవి.ఈ ద్వీపానికి అత్యంత ముఖ్యమైన ఆకర్షణ ఈ గుహ‌లే. ఇక్కడ పిల్లలతో క‌లిసి రైలు ప్రయాణాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఇది వారికి చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి చేరుకోవడానికి గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి ఫెర్రీ రైడ్ చేయవచ్చు. ఫెర్రీలు ప్రతి అరగంటకు ఇక్క‌డి నుండి బ‌య‌లుదేరుతాయి.

majuliisland1

మజులి ద్వీపం

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం అయిన బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మజులి చాలా అందమైన ద్వీపం. ఇక్క‌డికి వ‌చ్చేవారు. ద్వీపం యొక్క సాంప్రదాయ నృత్యం, చేతిపనులు, సంగీతం మరియు పక్షుల వీక్షణను ఆనందించవచ్చు. ఇది అస్సాంలోని జోర్హాట్ జిల్లా నుండి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఫెర్రీ ద్వారా మజులికి వెళ్ళవచ్చు. మజులికి రోజుకు రెండు పడవలు బయలుదేరుతాయి.

More News

    Read more about: lakshadweep tour
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+