Search
  • Follow NativePlanet
Share
» »శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు..నేడు కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి..

శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు..నేడు కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి..

దేశంలో ప్ర‌స్తుతం ద‌స‌రా న‌వ‌రాత్రి సంబురాలు అంబ‌రాన్నంటుతున్నాయి. ఈ క్ర‌మంలో మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఏపీలోని శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి, ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు అక్టోబర్ 12వ తేదీ వరకు ఘనంగా సాగ‌నున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున‌ తరలివస్తున్నారు. ఇప్పటికే ఈ ఆలయాలన్నీ విద్యుద్దీపాలంకరణతో ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు.

ఆల‌యంలో ఏడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శన‌మివ్వ‌నున్నారు. ఈ నెల 3న నుంచి జరిగే దేవిశరన్నవరాత్రులను యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ప్రారంభించి కలశస్థాపన, మండపారాధన అఖండజ్యోతి, మహగణపతి పూజ, జపానుష్టానాలతో పాటు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ చండీ, రుద్రపారాయణాలను నిర్వ‌హించారు. నేడు ఏడోరోజు ఉత్సవాల్లో భాగంగా గజవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్నారు ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవ కార్య‌క్ర‌మం నిర్వహించనున్నారు.

ప‌లు సేవ‌లు ర‌ద్దు..

నవరాత్రులలో భాగంగా క్షేత్రానికి వచే యాత్రికులు క్యూలైన్‌లు, మంచినీరు, వసతి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా త‌గిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆల‌య ఈవో పేర్కొన్నారు. అధేవిధంగా దేవీ శరన్నవరాత్రులలో ప‌లు సేవ‌ల‌ను ర‌ద్దు చేయ‌నున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మినహ మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు ఆల‌య అధికారులు తెలిపారు. వాహనసేవలను సామాన్య భక్తులు సైతం వీక్షించే విధంగా ఎల్‌ఈడీ స్కీన్‌లను కూడా ఏర్పాటు చేశారు.

Today Bhramarambikadevi in Kalaratri Alankaram

కాత్యాయని అలంకారంలో అమ్మ‌వారు..

ఏడోరోజు శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వారు. హంసవహనపై కొలువుదీరిన శ్రీస్వామి అమ్మవారికి ఆలయ అర్చకులు శాస్రోక్తంగా ప్రత్యేక పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.. అనంతరం అమ్మవారిని పుష్పపల్లకిలో అధిరోహించారు. కాత్యాయ‌ని అమ్మ‌వారికి ప్రత్యేకపూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు.. ఆ త‌ర్వాత విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైలం క్షేత్ర పురవీధులలో కాత్యాయని అలంకారంలోని అమ్మవారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేసిన పుష్పపల్లకిలో గ్రామోత్సవానికి తరలిస్తారు. ఈ ఉత్సవం ముందు కేరళ చండీమేళం కేరళ సంప్రదాయ డ్రమ్స్ కొమ్ము కోయ నృత్యం థయ్యం, సంప్రదాయ నృత్యం విళక్కు సంప్రదాయ నృత్యం వంటివాటితో స్వాగతిస్తున్నారు. స్వామివారి పుష్ప ప‌ల్ల‌కిని సంప్రదాయ నాట్యం నడుమ ఆలయ గంగాధర మండపం వద్ద పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారు గ్రామోత్సవంలో భక్తులను కటాక్షిస్తారు.

క‌న్నుల పండువ‌గా గ్రామోత్స‌వం..

ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా గంగాధర మండపం నుండి పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారు వీరభద్రస్వామి ఆలయం, అంకాలమ్మ గుడి, నంది మండపం వరకు భ‌క్తుల‌కు క‌నువిందుచేయనున్నారు.ఈ గ్రామోత్సవాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఈ పూజ కార్య‌క్ర‌మాలు, పుష్పపల్లకిసేవలో ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు..

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+