Search
  • Follow NativePlanet
Share
» »శీతాకాల‌పు ప్ర‌యాణంలో ఈ విష‌యాల‌ను అస్సులు మ‌ర్చిపోవ‌ద్దు

శీతాకాల‌పు ప్ర‌యాణంలో ఈ విష‌యాల‌ను అస్సులు మ‌ర్చిపోవ‌ద్దు

శీతాకాల‌పు ప్ర‌యాణంలో ఈ విష‌యాల‌ను అస్సులు మ‌ర్చిపోవ‌ద్దు

శీతాకాలం అంటే ఎవరికైనా త్వరగా నిద్ర లేవాలనిపించదు. అయితే, కొన్ని అందమైన ప్రదేశాలను ఈ సీజన్‌లో చూస్తేనే ఆస్వాదించగలం. అందుకే శీతాకాలంలో టూర్ ప్లాన్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విహారయాత్ర ఆనందంగా సాగిపోతుంది.

- విహార యాత్రలకు వెళ్ళేటప్పుడు ముందే వెళ్ళబోయే స్థలాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా, మనదేశంలో పర్యటించాలి అనుకునేవారైతే ఉత్తరాది కంటే దక్షిణాది ప్రాంతాలను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, నార్త్ వైపు చలి మరీ తీవ్రంగా ఉంటుంది. అలాగే, ప్రయాణం విమానంలో అయితే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. మంచు ఎక్కువగా కురుస్తుంటే విమానాలు రద్దు చేయడమో లేదా ఆలస్యంగా నడపడమో జరుగుతుంది. కాబట్టి ఈ వివరాలను ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది.

kodaikanal

- ప్ర‌యాణానికి పొద్దున్నే బయలుదేరడం మేలు. చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. విమానం లేదా రైలు ఆలస్యం అయినప్పటికీ ఏ అర్ధరాత్రి పూటో చిక్కుకుపోకుండా ఉంటారు. అలాగే, ఎయిర్‌లైన్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉండండి. చాలా రకాల ఎయిర్‌లైన్స్ వాటి అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటాయి. వీటిని ఫాలో కావడం వల్ల ముందుగానే వివరాలు తెలుసుకోవచ్చు.

- వీలైనంతవరకు ఒకే విమానం లేదా ఒకే రైల్లో ప్రయాణం చేసేలా చూసుకోండి. అంటే మధ్యలో బ్రేక్ జ‌ర్నీలు వద్దు. మధ్యలో ఆగకుండా ఒకేసారి గమ్యం చేరేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మొదటి విమానం ఆలస్యంగా వస్తే, ఆ తరువాత ఎక్కాల్సిన విమానం వెళ్లిపోవచ్చు. అప్పుడు మరో విమానం కోసం వెయిట్ చేయాల్సిన సమయంలో ఎక్కడ ఉండాలో అర్థం కాదు. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే నాన్ స్టాప్ ఆప్షన్‌ను ఎంచుకుని మజిలీ లేకుండా ప్రయాణం చేయడం మేలు.

agumbe

- ప్రయాణానికి కచ్చితంగా ఉన్ని దుస్తులను తీసుకువెళ్ళాలి. స్వెటర్స్, షాల్స్ వంటివి అదనంగా తీసుకెళ్ళడం మంచిది. స్వెట్టర్లతో పాటుగా బ్లాంకెట్ కూడా అదనంగా తీసుకెళ్లండి. విహారయాత్ర ముగిసేంత వరకు ఇవి మనతోపాటే ఉండేలా చూసుకోవాలి. అలాగే, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చలి ప్రదేశాల్లో తీసుకునే ఆహారం తాజాగా ఉండాలి. అలాగే, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో వెచ్చవెచ్చగా సూప్ తీసుకుంటే హాయిగా ఉంటుంది.

- మస్కిటో లోషన్, బాడీలోషన్స్ తో పాటు చర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఇతర ఉత్పత్తులను వెంట తీసుకెళ్ళడం అవసరం. లేదంటే చర్మం పొడిబారిపోయి, దురద లాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ప్రతిరోజూ రాత్రి పూట శరీరానికి కొబ్బరినూనె రాసుకుంటే మంచిది. అది ఈ సీజన్‌లో చర్మాన్ని కాపాడుతుంది.

- చలికాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల అవకాశమూ ఉంటుంది. కాబట్టి బేసిక్ మందులు అంటే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి వాటికి సంబంధించిన మందులు తప్పనిసరిగా తీసుకెళ్లండి. డయాబెటిస్ లాంటి జబ్బులుంటే మీ మందుల కిట్ తీసుకెళ్లడం అస్సలు మరవొద్దు.

More News

    Read more about: winter journey
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+