ప్రస్తుతం ఓ వైపు శ్రావణమాసం నడుస్తోంది. మరోవైపు తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే శ్రావణ మాసంలో వచ్చే సోమవారానికి ఎంతో పవిత్రత ఉంద. ఈ రోజున భక్తులు భోలేనాథుని ఆశీస్సులు పొందాలనుకుంటారు. అందుకోసం చాలామంది శివాలయాలను సందర్శిస్తుంటారు. శ్రావణ సోమవారంలో ఎంతో భక్తిశ్రద్దలతో శివనామస్మరణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఇక, ఏపీలోని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయంలో ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 3 వరకు శ్రావణ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ వారు ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకూడా నిండుకుండలా మారింది. దీంతో ఓ వైపు శ్రీశైలాన్ని సందర్శించేందుకు భక్తులు, పర్యాటకులు పోటీపడుతున్నారు. వారికోసం ప్రత్యేకంగా అతి తక్కువ ధరతో తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఇది బస్సు ప్రయాణం. ఈ జర్నీ హైదారబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈపూర్తి వివరాలేంటో చూసేద్దాం పదండి.
రూ. 2వేలతో టూర్..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా శ్రీశైల మల్లిఖార్జున స్వామి దర్శనంతో పాటు సమీపంలోని ప్రసిద్ధిచెందిన ప్రదేశాలను కూడా చూపిస్తుంది. కేవలం 2 వేల రూపాయలతోనే ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రయాణికులు ఇతర పూర్తి వివరాల కోసం లేదా బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారికి వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/ సంప్రదించగలరు. ప్రతిరోజూ ఈ టూర్ ప్యాకేజీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఈ ట్రిప్ లో భాగంగా శ్రీశైలం దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార పంచధార, శ్రీశైలం డ్యామ్ వంటి ప్రాంతాలను చూపిస్తారు. డైలీ శ్రీశైలం టూర్ పేరుతో ఈ ప్యాకేజీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయాణం హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ, నాన్ ఏసీ బస్సు సౌకర్యం ఉంటుంది. ఎంచుకున్న దానిబట్టి టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతిరోజు హైదరాబాద్ పర్యాటక భవన్, బషీర్‌బాగ్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
రెండు రోజుల టూర్ షెడ్యూల్..
ఈ ప్రయాణంలో భాగంగా మొదటిరోజు హైదరాబాద్‌లోలోని పర్యాటక భవన్ నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ఆ తర్వాత భోజనం చేసుకుని మార్గమధ్యంలో సాక్షి గణపతి ఆలయం దర్శనం ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ స్టే చేసేందుకు ముందుగా హోటల్‌కు వెళతారు. శ్రీశైలంలోనే రాత్రంతా స్టేయింగ్ ఉంటుంది. ఇక, మరుసటి రోజు ఉదయం శ్రీ మల్లిఖార్జున స్వామి దర్శనం అనంతరం అల్పాహారం చేస్తారు.
ఆ తర్వాత హోటల్ నుండి చెక్ అవుట్ అయ్యి రోప్ వే జర్నీకు బయలుదేరుతారు. రోప్ వే ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్‌గా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రయాణం తర్వాత సమీపంలోని పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్ వంటి తదితర ప్రాంతాల వీక్షణ ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి అదే రోజు రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీ ధరల విషయానికొస్తే... ఏసీ బస్సు ప్యాకేజీ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం పెద్దలకు రూ. 2400 ఉంటుంది. అదే ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలయితే రూ.1920 చెల్లించాల్సి ఉంటుంది. ఇక, నాన్ ఏసీ బస్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి పెద్దలకయితే రూ.2000గా ఉంటుంది. అదే చిన్నారులకయితే రూ.1600గా నిర్ణయించారు.



Click it and Unblock the Notifications













