Search
  • Follow NativePlanet
Share
» »జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో విహారానికి సిద్ధంగా ఉండండి!

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో విహారానికి సిద్ధంగా ఉండండి!

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో విహారానికి సిద్ధంగా ఉండండి!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమావోన్-హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ప్రకృతి శాస్త్రవేత్తగా ప‌నిచేసిన జిమ్ కార్బెట్ పేరును దీనికి పెట్టారు. ఆయ‌న‌ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో కల్నల్‌గా పనిచేశారు. క్రూర‌మైన‌ పులులు మరియు చిరుతల వేటగాడిగా పేరు పొంది, కుమావోన్‌లోని స్థానికులచే ప్రశంసించబడ్డారు. 1921లో స్థాపించబడిన ఈ నేచర్ రిజర్వ్ స్థాపనలో జిమ్ కార్బెట్ కీల‌క‌ పాత్ర పోషించారు.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 520.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 50,000 మంది సందర్శకులు ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను వీక్షించేందుకు వ‌స్తూ ఉంటారు. ఈ భూభాగంలో కొండలు, లోయలు, చిత్తడి నేలలు, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, సరస్సు మరియు విస్తారమైన గడ్డి భూములు ద‌ర్శ‌న‌మిస్తాయి. పార్క్ యొక్క సమశీతోష్ణ వాతావరణం సంవత్సరంలో ఎక్కువ రోజులు ఉండ‌టం వ‌ల్ల ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్న ఈ పార్క్ అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. పొగమంచుతో కూడిన శీతాకాలంలో ఉష్ణోగ్ర‌త‌ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే పెరగకుండా ఉండటంతో జిమ్ కార్బెట్ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన వన్యప్రాణుల నిల‌యాల్లో ఒకటిగా నిలుస్తోంది.

roads-of-corbett-1533623184-1666166989.jpg -Properties

సందర్శించడానికి ఉత్తమ సమయం

ఉష్ణమండల పర్వత ప్రాంతంలో ఉన్నందున, వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా పార్క్ చేరుకోవడం పెద్ద స‌హ‌స‌మ‌నే చెప్పాలి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ప్రతి సంవత్సరం నవంబర్ 15 నుండి జూన్ 15 వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడి అట‌వీ ప్రాంతంలో అరుదైన జంతువులను సులభంగా గుర్తించడానికి ఉత్తమ సమయం డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలల మధ్య ఉంటుంది. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనంలో శీతాకాలం ఆహ్లాదకరంగా ఉండ‌టంలోపాటు చాలా జంతువులను సులభంగా గుర్తించవచ్చు.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోని వన్యప్రాణులు

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద ఉన్న ఎక్కువ‌ భూభాగం 586 పక్షి జాతులు, 33 రకాల సరీసృపాలు మరియు ఉభయచరాలు, దాదాపు 25 జాతుల జంతువులతో కూడిన వృక్షజాలం మరియు జంతుజాలంతో నిండి ఉంటుంది. జంతువుల‌తో పులి, ఏనుగు, జింక, అడ‌వి పంది, సాంబార్ జింక, చిరుతలు, నక్కలు, రీసస్ మకాక్, లంగూర్, హిమాలయన్ గోరల్, మార్టెన్, నలుపు ఎలుగుబంటి, భారతీయ పాంగోలిన్ మొదలైనవి ఉంటాయి. అలాగే ప‌క్షుల్లో 580 కంటే ఎక్కువ జాతులు ఇక్కడ కనిపిస్తాయి, వాటిలో అత్యంత సాధారణమైనవి పెలికాన్స్, గ్రేట్ క్రెస్టెడ్ గ్రీబ్, గ్రేలాగ్ గీస్, ఇండియన్ షాగ్, కార్మోరెంట్స్, గ్రే హెరాన్, బ్లాక్-వింగ్డ్ కైట్, ఓస్ప్రే, ఫిషింగ్ ఈగిల్, హిమాలయన్ లాంగ్. రాబందు, క్రెస్టెడ్ హనీ బజార్డ్, నైట్‌జార్‌లు, గుడ్లగూబలు, ఆకుపచ్చ పావురాలు, చిలకలు, కోకిల, కౌకల్, వడ్రంగిపిట్టలు మొద‌లైన‌వి ఉంటాయి. సరీసృపాలతో ఘరియాల్, మగ్గర్ మొసలి, ఇండియన్ పైథాన్, కింగ్ కోబ్రా మరియు మానిటర్ లిజార్డ్ మొదలైనవి ఇక్కడ చూడవచ్చు.

tigercorbetted

సమీప విమానాశ్రయం - జాతీయ ఉద్యానవనం ఫూల్‌బాగ్‌లోని సమీప దేశీయ విమానాశ్రయం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి 238 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూఢిల్లీలో సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ నుండి ఫూల్‌బాగ్‌కు విమానాలు అందుబాటులో లేవు.

సమీప రైల్వే స్టేషన్ - పార్క్ నుండి సమీప రైల్వే స్టేషన్ 12 కిలోమీటర్ల దూరంలో రామ్‌నగర్‌లో ఉంది. ఢిల్లీ మరియు ఉత్తరాఖండ్‌లోని అన్ని ఇతర రైల్వే స్టేషన్ల ద్వారా రామ్‌నగర్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

రహదారి - జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ రోడ్లతో బాగా అనుసంధానించబడి ఉంది. ఇక్క‌డికి ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీకి ద‌గ్గ‌ర‌లోని చాలా పట్టణాల ద్వారా చేరుకోవచ్చు.

More News

    Read more about: jim corbett national park
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+