Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ పర్యటన - ఒక చిన్న పరిచయం !

ఉత్తర భారత దేశం లోని ఉత్తరాఖండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేవతల భూమి గా ప్రసిద్ధి కెక్కిన ఉత్తరాఖండ్ భూమి పై స్వర్గంగా విలసిల్లుతూ ప్రపంచ సుందర దృశ్యాల కు నెలవై వుంది.

ఉత్తరా ఖండ్ రాష్ట్రం ఒక వైపున అంటే ఉత్తరాన  టిబెట్ మరో వైపు అంటే తూర్పున నేపాల్ దేశాలు సరిహద్దు గా కలిగి వుంది. దక్షిణ దిశలో మన దేశం లోని ఉత్తర  ప్రదేశ్ మరియు నైరుతి హద్దులో హిమాచల్ ప్రదేశ్ కలిగి వుంది. ప్రారంభం లో దీనిని ఉత్తరాంచల్ అనేవారు. జనవరి 2007 నాటి నుండి ఉత్తరాంచల్ పేరును ఉత్తరాఖండ్ గా మార్పు చేసారు. ఈ రాష్ట్రం లో 13 జిల్లాలు కలవు. వీటిని రెండు ప్రధాన డివిజన్ లు గా విభజించారు. అవి కుమావొన్ మరియు గర్హ్వాల్, ఇవి గతం లో రెండు రాజ్యాలుగా ఉండేవి. వాతావరణం ఉత్తరాఖండ్ లో మూడు ప్రధాన సీజన్లో లు వుంటాయి. అవి వేసవి, శీతాకాలం మరియు వర్షాకాలం. ఈ ప్రాంత వాతావరణం భౌగోళిక విభజనలు పైడ్ ఆధార పడి వుంది. అవి పర్వత ప్రాంతాలు , మైదానాలు గా వుంది. ఈ ప్రాంత పర్యటనకు వేసవి కాలం అనుకూలమైనది. శీతాకాలం లో కూడా పర్యటించవచ్చు. అయితే, ఈ కాలం లో కొన్ని ప్రాంతాలు అధిక మంచు తో కప్పబడి పర్యటనకు అసౌకర్యం కలిగిస్తాయి.

భాషలు ఉత్తరాఖండ్ రాష్ట్రం లో అధికార భాష హిందీ. అయితే వివిధ ప్రాంతాలలో స్థానిక భాషలు మాట్లాడతారు. కుమావొనీ మరియు గర్హ్వాలి భాషలు ప్రధానమైనవి మరియు అధిక జనాభా చే మాట్లాడ బడేవి. కొన్ని ప్రాంతాలలో పహారీ భాష కలదు. కుమావొనీ క్రింద, వచ్చే భాషలు జోహారి, దంపురియా, అస్కోటి, సిరాలి, గంగోల, ఖాస్పర్జియా, ఫల్దకోటి, మచ్చి, రోచ భాయిసి, మాజ్ కుమియ, సోర్యాలి, చౌగార్ఖ్యాలి మరియు కుమాయి లు కలవు. గర్వాలీ భాష లో కూడా అనేక అప్ తరగతులు కలవు వాటిలో జూన్ సరి , సైలాని, మార్చి ప్రధానమైనవి. ప్రధాన భాషలు సంస్కృతం, సెంట్రల్ పహరి, మరియు సౌరసేని ప్రాకృతి కాగా ఈ భాషలకు దేవనాగరి లిపి కలదు. ఉత్తరాఖండ్ పర్యటన ఉత్తరాఖండ్ లని 13 జిల్లాల లోను కల పర్యాటక ఆకర్షణల జాబితా నానాటికి పెరిగి పోతోంది. ఎప్పటి కపుడు కొత్త మరియు ఆకర్షణీయ ప్రదేశాలు కని పెడుతున్నారు, వాటిని అభివృద్ధి చేస్తున్నారు. యాత్రా స్థలాలు నుండి సైట్ సీఇంగ్ నుండి త్రాక్కింగ్ మరియు రాఫ్టింగ్ వంటి ప్రదేశాలు ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షిస్తున్నారు.  

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సరస్సుల జిల్లా గా ప్రసిద్ధి చెందినా నైనిటాల్ సముద్ర మట్టానికి 1938 మీ. ల ఎత్తున కల ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ చిన్న భూతల స్వర్గాన్ని బ్రిటిష్ వారు 1841 లో కనుగొని దానిని ఒక విశ్రాంతి ప్రదేశం గా మలచారు. 'నైని' అనే పదం అక్కడ కల హిందూ గుడి లోని దేవత నైని పేరు మీదుగా పెట్టారు. ఇది సరస్సు ఒడ్డున కలదు. నైనిటాల్ ప్రదేశం పర్యాటకులకు బోటింగ్, యాచింగ్, ఫిషింగ్ క్రీడల ఆనందాలు అందిస్తుంది.  నైనిటాల్ చుట్టపట్ల కల ఆకర్షణీయ ప్రదేశాలు కూడా ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఇక్కడకు రప్పిస్తాయి. ఈ ప్రదేశాలలో హనుమాన్ గారి, ఖుర్పతల్, కిల్బురి, లరియకాంత, లాండ్స్ ఎండ్ వంటివి కొన్ని ప్రధానమైనవి. ఈ ప్రదేశాలే కాక, నైని శిఖరం, స్నో వ్యూ, నైనిటాల్ రోప్ వే, భిమ్తాల్, నౌకుచియ తాల్, సాత్ తాల్ వంటివి మరి కొన్ని అందమైన ప్రదేశాలు.  అందమైన ముస్సూరీ ని 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని అంటారు. ఇక్కడి పచ్చటి కొందు, మంచు చే కపబడిన హిమాలయ పర్వతాలు, దక్షిణ దిశా గా వీటి వెనుక కల డూన్ వాలీ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. యమునా బ్రిజ్ , నాగ్ టిబ్బా , ధనోల్తి మరియు సుర్ఖండా దేవి వంటివి ముస్సూరీ చుట్టూ కల ఆకర్షణీయ ప్రదేశాలు.  

కౌసాని లో అద్భుతమైన ప్రదేశాలు కాత్యూరి వాలీ, గోమతి నది, పంచాచూలి మంచు శిఖరాలు, నందా కోట్, నందా దేవి, త్రిశూల్, నందా ఘుంటి, చౌఖంబా, మరియు కేదార్నాథ్ లు చూడవచ్చు. అనాసక్తి ఆశ్రం, ప్యాంటు మ్యూజియం మరియు లక్ష్మి ఆశ్రమం ప్రదేశాలి పర్యాటకులలో ప్రసిద్ధి గాంచాయి.  

సహజ అందాలకు, వన్య జీవులకు పేరు గాంచిన ప్రదేశాలు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, కేదార్నాథ్ సంక్చురి లు తప్పక చూడవలిసిన ప్రదేశాలు. గోవింద్ వైల్డ్ లైఫ్ సంక్చురి, బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి, అస్సన్ బ్రజ్ బర్డ్ సంక్చురి, నందా దేవి నేషనల్ పార్క్, ఆస్కోట్ వైల్డ్ లైఫ్ సంక్చురి ల సందర్శనలు మరువలేని ప్రదేశాలు.  

ఆది కైలాష్, అల్మోర, అగస్త్యముని, బద్రినాథ్, దేవప్రయాగ్ ద్వా రహాట్, గంగ్నాని, గంగోలిహాట్, గంగోత్రి మరియు గౌరికుండ్ వంటి ప్రదేశాలలలో పర్యాటకులు మతపర క్రతువులు చేస్తారు. హరిద్వార్, కేదార్నాథ్, రుద్రనాత్, కల్పేశ్వర్ మరియు జగేశ్వర్ ప్రదేశాలు వీటిలో మరికొన్ని.  ట్రెక్కింగ్, మౌన్తైనీరింగ్, స్కీయింగ్, మరియు రివర్ రాఫ్టింగ్, బైకింగ్, పరా గ్లైడింగ్, కామ్పింగ్ వంటి అధిక ఆనందాలకు హిమాలయ, కారకోరం పర్వత శ్రేణులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎంతో అనుకూలమైనవి గా ప్రసిద్ధి చెందాయి. 

ఉత్తరాఖండ్ ప్రదేశములు

  • గంగోత్రి 15
  • గోముఖ్ 14
  • జియోల్కొట్ 7
  • కల్సి 21
  • కుమావున్ 14
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun