Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కుమావున్

కుమావున్ - హిమనీ నదములు!

14

కుమావున్ గఢ్వాల్ తో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిపాలనా విభాగంలో ఉంది. చంపావత్, నైనిటాల్, ఆల్మోరా, బాగేశ్వర్, పితోరగర్ మరియు ఉధం సింగ్ నగర్ జిల్లాలు కుమవోన్ యొక్క పాలనా విభాగం కింద ఉన్నాయి. ఈ ప్రదేశం ఉత్తరాన టిబెట్, దక్షిణాన ఉత్తర ప్రదేశ్, తూర్పున నేపాల్ మరియు పశ్చిమాన గఢ్వాల్ సరిహద్దులుగా కలిగి ఉంది. ఇక్కడి స్థానిక భాష కుమావుని. నైనిటాల్, ఆల్మోరా, హాలడ్వాని, ముక్తేశ్వర్, పితోరగర్, కాశీపూర్, రుద్రాపూర్ మరియు రాణిఖెట్ దీని ప్రముఖ నగరాలలో కొన్ని.

ఈ స్థలం పేరు కూర్మావతారము అనే అర్థం వచ్చే 'కుర్మాంచల్' నుండి తీసుకున్నారు. 'కూర్మావతారము' హిందూ మత దైవం శ్రీ మహా విష్ణువు యొక్క తాబేలు అవతారం. ఈ స్థలం కుమవోన్ దళం అనే ప్రఖ్యాత సైనిక దళం కొరకు కూడా ప్రసిద్ధి చెందింది. నందా దేవి మేళా, చైతి మేళా, హిల్జాత్రా, బగ్వాల్, ఉత్తరాయని మేళా మరియు కండలి వంటి వివిధ ఉత్సవాలు మరియు పండుగలు గొప్ప ఉత్సాహంతో ఈ ప్రాంతంలో నిర్వహిస్తారు.

అబ్బాట్ పర్వతం భారతదేశం లోని బ్రిటిష్ పాలనలో నిర్మించబడిన కేవలం 13 కుటీరాలు గల ఒక అందమైన కొండ. జాన్ హెరాల్డ్ అబ్బాట్ బంగాళాలు మంచు కప్పబడిన పర్వతాలు మరియు దట్టమైన సిందూర & దేవదారు చెట్లు మధ్య ఉన్నాయి. ఇది కాక, పర్యాటకులు 6191 మీటర్ల ఎత్తులో ఉన్న ఓం లేదా ఆది కైలాష్ పర్వతం చూడగలరు. ఈ పర్వతాన్ని బాబా కైలాష్ మరియు జాంగ్ లింగ్ కాంగ్ శిఖరం మరియు చిట్టి కైలాష్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం టిబెట్ లోని కైలాష్ పర్వతంతో సామీప్యత కలిగి ఉన్న శిఖరం పై ఓం ఆకారంలో ఉన్న మంచు ఏర్పాటు వల్ల పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది.

మిలాం హిమానీనదము 5,500 మీటర్ల నుండి 3,870 మీటర్లు వరకు ఎత్తులో ఉన్న మరొక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ హిమానీనదం, కుమవోన్ ప్రాంతం యొక్క అతిపెద్ద హిమానీ నదం. పర్యాటకులు మున్సియారి ని ఈ హిమానీనదం చేరడానికి ట్రెక్కింగ్ స్థావరంగా ఉపయోగించవచ్చు. పర్యాటకులు చూడటానికి అందమైన ప్రదేశాలైన జలపాతాలు, అడవులు మరియు గ్రామాల ద్వారా ఈ ట్రెక్కింగ్ మార్గం వెళుతుంది. 3627 మీటర్ల ఎత్తులో ఉన్న పిండారి హిమానీనదము , కుమవోన్ యొక్క మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇది బాగేశ్వర్ జిల్లాలో, నందకోట్ మరియు నందా దేవి శిఖరాల మధ్య ఉంది. ఈ హిమానీనదం దక్షిణాన ప్రవహిస్తూ పిండారి నదికి జన్మనిస్తుంది.

మున్సియారి సముద్ర మట్టానికి 2298 మీటర్ల ఎత్తులో ఉన్న మరొక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. హిమాలయాల మధ్య ఉన్న ఈ స్థలం త్రిశూల్, నందా దేవి మరియు పంచచూలి శిఖరాల అద్భుతమైన వీక్షణా దృశ్యాలు అందిస్తుంది. ఈ ప్రాంతం యొక్క అత్యద్భుతమైన అందాన్ని పైన్, దేవదారు మరియు రోడోడెండ్రాన్ చెట్లు మరింత పెంచుతాయి. ఈ ప్రాంతంలో సంచరిస్తూ, ప్రయాణికులు వివిధ జాతుల వృక్షజాలం మరియు జంతుజాలం కూడా కనుగొనవచ్చు. మున్సియారి నందా దేవి శిఖరం, రాలాం, మిలాం మరియు నామిక్ కోసం కూడా ట్రెక్కింగ్ స్థావరంగా పనిచేస్తుంది. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి ఈ ప్రాంతంలో స్కీయింగ్ మరియు ఇతర శీతాకాల క్రీడలు కూడా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. పిండార్ లోయ యొక్క పడమటి వైపు ఉన్న సుందర్ దుంగా అనే ప్రముఖ పర్యాటక ప్రదేశం వద్ద ప్రయాణికులు మత్కోటి మరియు సుఖరాం అనే రెండు హిమానీనదాలను చూడవచ్చు. సుందర్ దుంగా అనే పదానికి 'అందమైన రాళ్ల లోయ' అని అర్ధం.

కుమావున్ సమీపంలోని విమానాశ్రయం భారతదేశం యొక్క ప్రధాన నగరాలతో సంబంధం గల పంత్నగర్ విమానాశ్రయం. లక్నో, హౌరా, ఢిల్లీతో సహా భారతదేశం యొక్క వివిధ నగరాలతో అనుసంధానించబడిన కత్గోడం కుమవోన్ కు సమీప రైల్వే స్టేషన్. రహదారి గుండా వెళ్ళే ఆసక్తి గల ప్రయాణికులు ఉత్తరాఖండ్ సమీపంలోని నగరాలు నుండి బస్సు సేవలను పొందవచ్చు. కుమావున్ యొక్క వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే, శీతాకాలంలో కుమవోన్ సందర్శించబోయే ప్రయాణికులు అవసరమైన ఉన్ని బట్టలు తీసుకువెళ్ళాలని సూచిస్తారు. అలాగే, వర్షాకాలాలలో ఈ స్థలం సందర్శించడానికి తగిన వర్షపు దుస్తులు తీసుకువెళ్ళాలని సలహా ఇస్తారు.

మున్సియారి

'చిట్టి కాశ్మీర్' అని కూడా పిలువబడే మున్సియారి, హిమాలయాల నడుమ సముద్ర మట్టానికి సుమారు 2298 మీటర్ల ఎత్తులో నిలిచిన ఒక సుందరమైన ప్రదేశం. ఈ ప్రాంతం, భారతదేశం, నేపాల్ మరియు టిబెట్ సరిహద్దుల మధ్య ఉంటుంది. గతంలో ఒక నిషేదిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశం, పంచచూలి , నందా దేవి మరియు త్రిశూల్ శిఖరాల అద్భుతమైన దృశ్యాలని అందిస్తుంది. ఈ ప్రాంతం, అందమైన మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు రోడోడెండ్రాన్, పైన్ మరియు దేవదారు చెట్ల ఆకుపచ్చ అడవులు సరిహద్దులుగా కలిగి ఉంది. వృక్ష, జంతు మరియు పక్షి జాతులలో వివిధ జాతులను ఈ ప్రాంతంలో గుర్తించవచ్చు. యాత్రికులు మున్సియారి అడవులలో తిరుగుతూన్న హిమాలయ ఎలుగుబంటి, కస్తూరి జింక, చిరుత మరియు నక్కలు చూడగలరు. ఇక్కడ చూడగలిగే కొన్ని పక్షుల్లో గద్ద, కాకి, సర్పిలాకార గద్ద, వాగ్టైల్, మోనాల్ మరియు హిమాలయ గ్రిఫ్ఫోన్ ఉంటాయి. ఇది పర్వతంపాదం లో ఉండటం వల్ల రాలాం, మిలాం, నామిక్ వంటి హిమానీనదాలు మరియు నందా దేవి శిఖరం చేరుకోవటానికి ఆదర్శవంతమైన ట్రెక్కింగ్ స్థావరంగా పని చేస్తుంది. అలాగే, మున్సియారి శీతాకాలంలో స్కీయింగ్ మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించబడే హిమక్రీడలకు కేంద్రంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది.

కుమావున్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కుమావున్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కుమావున్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కుమావున్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: రహదారి ప్రయాణం ఆసక్తి గల పర్యాటకులు ఉత్తరాఖండ్ లో వివిధ నగరాల నుంచి బస్సు సేవలను పొందవచ్చు. ప్రభుత్వ యాజమాన్యంలోనివి మరియు ప్రైవేట్ బస్సులు కూడా కుమవోన్ చేరుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం: కుమవోన్ సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్, ఢిల్లీ, హౌరా, లక్నో మరియు ఇతర భారతదేశ ప్రధాన నగరాలతో అనుసంధానించబడిన కత్గోడం వద్ద ఉంది. కుమవోన్ చేరుకోవడానికి యాత్రికుల క్యాబ్లు మరియు టాక్సీలు వినియోగించవచ్చు లేదా రైల్వే స్టేషన్ నుండి బస్సులు కూడా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానయానం: కుమవోన్ సమీపంలోని విమానాశ్రయం భారతదేశం యొక్క ప్రధాన నగరాలలో బాగా అనుసంధానించబడిన పంత్నగర్ వద్ద ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun