కార్బెట్ నేషనల్ పార్క్ - ప్రేమికుల భూతల స్వర్గం !

కార్బెట్ నేషనల్ పార్క్ ని వన్య మృగ ప్రేమికుల భూతల స్వర్గంగా చెప్పవచ్చు. ప్రక్రుతి మాత ఒడిలోనిని ఈ పార్క్ మొదట రాంనగర్ నేషనల్ పార్క్ గా పిలువబడేది. 1957 లో కార్బెట్ నేషనల్ పార్క్ గా పేరు మార్చారు. ప్రఖ్యాత బ్రిటిష్ ప్రక్రుతి ప్రేమికుడు ఫోటోగ్రాఫర్ మరియు వేటగాడు అయిన జిమ్ కార్బెట్ పేరున ఈ పార్క్ పేరు గడించింది. అయన రాసిన పుస్తకం 'మాన్ ఈటర్స్ అఫ్ కుమోన్' భారత దేశం లో ని కుమోన్ ప్రాంతం లో అయన అనుభవాలను తెలియచేస్తుంది. ఈ పుస్తకం లో రచయిత 400 మనుషులని చంపిన పులి ని వేటాడడం లో తన అనుభవాన్ని తెలియచెప్పారు.

గొప్ప హిమాలయ పర్వతాల పాద ప్రాంతం లో ఉన్నది ఈ నేషనల్ పార్క్. భారత దేశం పేరెన్నిక గన్న అటవీ సంపద మరియు 160 పులులు కలిగిన ప్రాంతం గా ఈ పార్క్ ప్రఖ్యాతి పొందింది. రామగంగా నదీ తీరాన ఉన్న ఈ పార్క్ పర్యాటకులకు అద్భుతమైన సైట్ సీయింగ్ మరియు సాహసవంతమైన సఫారీలతో ఆకర్షిస్తున్నది.

పులి, చిరుత, ఏనుగు, చుక్కల జింక, సాంబార్, హాగ్ డీర్, బార్కింగ్ డీర్, స్లోత్ బీర్, వైల్డ్ బొర్ మరియు రీసస్ మంకీ వంటి జంతువులని ఈ పార్క్ లో చూడవచ్చు. అంతే కాక, పీకాక్, ఫీసంట్, పిజియన్, అవుల్, హార్న్ బిల్, బర్బేట్, లార్క్, మైన, మాగ్పీ, మినివేట్, పాట్రిడ్జ్, తృష్, తిట్, నుతచ్, వాగ్ టైల్, సన్ బర్డ్, బంటింగ్, ఒరియోల్, కింగ్ ఫిషర్, ద్రొంగొ, డోవ్, వుడ్ పెకెర్, డక్, టీల్, ఈగల్, స్టోర్క్, కార్మోరాంట్, ఫలకాన్, బుల్బుల్ మరియు ఫ్లై కాచేర్ వంటి 600 రకాల పక్షులు ఇక్కడ నివసిస్తాయి. అంతే కాక, 51 రకాల పొదలు మరియు 30 రకాల వెదురు, ఇంకా 110 జాతుల వృక్షాలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు.

ఈ పార్క్ లో ని ఒక చివర ఉన్నటువంటి పట్లి దున్ వాలీ లోని ధికాలా వన్య మృగ ప్రేమికులకు ముఖ్య ప్రదేశం.

ఇక్కడినుండి పర్యాటకులకు అందమైన లోయ అందాలను చూసి తరించే అవకాసం కలుగుతుంది. వెనకాల ఉన్నటువంటి కందా రిడ్జ్ ఈ అందాలను రెట్టింపు చేస్తుంది. రామగంగా నది అనేక పాయలుగా ఈ లోయ గుండా ప్రవహిస్తుంది. ధికాలా చౌర్ మరియు ఫులై చూర్ గడ్డి భూములు ధికలా టూరిస్ట్ కాంప్లెక్స్ యొక్క అందాలను ఇనుమడింప చేస్తాయి. ధికాలా చౌర్ ఈ పార్క్ లో ని అతిపెద్ద గడ్డి భూమిగా గుర్తించబడింది. ఇక్కడ జరిగే సఫారీ ల ద్వారా పర్యాటకులు వైల్డ్ ఎలిఫెంట్, చీతల్, హాగ్ డీర్, రప్తర్స్ మరియు వివిధ రకాల పక్షులను తిలకించవచ్చు.

అనుభవజ్ఞులైన గైడ్లతో ఈ పార్క్ లో చేసే ట్రెక్కింగ్ ఒక గొప్ప అనుభవాన్ని మిగులుస్తుంది. కలాగర్హ్ డ్యాం,ఈ పార్క్ నైరుతి భాగాన ఉన్నటువంటి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం, చలి కా లం లో పర్యాటకులు ఇక్కడ మైగ్రేటరీ వాటర్ ఫౌల్ ను చూడవచ్చు.

పర్యాటకులు కార్బెట్ వాటర్ ఫాల్ యొక్క అందాలను కూడా అస్వాదించవచ్చు. . కామ్పింగ్ , పిక్నిక్ లకు మరియు బర్డ్ వత్చింగ్ కు ఇది అనువైన ప్రదేశంభిజ్రని మరియు దికాల ప్రదేశాలలో ఈ సఫారీని సరసమైన ధరలకు లభిస్తాయి. కోసి నది రాఫ్టింగ్ అవకాశాలను పర్యతల్కులకు అన్దిస్తున్ది. కోసి నది చుట్టూ ఉండే అనేక రిసార్ట్ లు రాఫ్టింగ్కి కావలసిన సామగ్రిని అందిస్తాయి. పర్యాటకులు ఎలిఫెంట్ సఫారీ, జీప్ సఫారీ మరియు హార్స్ సఫారీ ల ద్వారా చాల ఆనందం పొన్దవచ్చు. పర్యాటకులకు అందే మరొక విశేషం కోసి నది ప్రదేశం లోని మాన్శీర్ ఫిషింగ్. ఇక్కడి అనేక రిసార్ట్ లు ఫిషింగ్ కు అవసరమైన ఏర్పాట్లు సమకురుస్తాయి.

కలదుంగి లో ఉన్న కార్బెట్ మ్యూజియం తప్పక సందర్శించవలసిన ప్రాంతం. ఇది ఒక వారసత్వ భవనం. జిమ్ కార్బెట్ నివసించిన ఈ భవనం లో అయన వాడిన వస్తువులతో పాటు అరుదైన ఛాయాచిత్రాలను చూడవచ్చు. పర్యాటకులు కుమోన్ పర్వత పాద ప్రాంతం లో ని క్యాంపు క్యారి లో బస చేయవచ్చు. సోనా నది వైల్డ్ లైఫ్ సాంచురీ లో ఆసియ ఏనుగులు మరియు పులులను చూడగలిగే అవకాశం పర్యాటకులకు లభిస్తుంది.

రామగంగా నది, మండల నది మరియు సోనా నది ఈ పార్క్ లో ని పర్యావరణం లో ముఖ్య భూమిక ని పోషిస్తాయి. పర్యాటకులు ఇక్కడ రుతువుల లో ఏర్పడే కాలువలను 'సాట్స్' ను చూడవచ్చు. సీతాబాణీ టెంపుల్ మరియు రాంనగర్ అనేవి ఇతర ముఖ్య ఆకర్షణలు. అంతే కాక, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వాయు రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉన్నది. సందర్శకులు ఎండాకాలం మరియు చలికాలాలలో ఈ పార్క్ ని తిలకించడం ఉత్తమం.

Please Wait while comments are loading...