కార్బెట్ నేషనల్ పార్క్ ని పర్యటించే పర్యాటకులకు ముఖ్యమైన ఆకర్షణ ఫిషింగ్. కోసి నది మరియు రాంగంగా నది ఈ మహ్సీర్ ఫిషింగ్ కి అనువైనటువంటి ప్రదేశాలు. అంతేకాకుండా, ప్రత్యేక మహ్సీర్ ఫిషింగ్ టూర్స్ ని రామగంగా నది దగ్గర ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు ఫ్లై ఫిషింగ్ ను మరియు స్పిన్నింగ్ ని ఆనందించవచ్చు. ఈ పార్క్ లో ఫిషింగ్ అనేక ప్రదేశాలలో అనుమతించబడింది. ముఖ్యంగా రాంగర్, పంచేస్వర్ మరియు బిన్సార్ వంటి ప్రదేశాలలో ఫిషింగ్ ను చేసుకోవచ్చు. అయినప్పటికీ ఇక్కడి ఫారెస్ట్ అధికారుల వద్ద పర్యాటకుల ముందస్తు అనుమతిని పొందటం తప్పనిసరి.
ఫిషింగ్ లో ఉత్సాహం కల పర్యాటకులు తప్పనిసరిగా తెచ్చుకోవలసిన వస్తువులు రక్సక్, స్ట్రా హాట్స్, సన్ గ్లాస్సెస్, షూస్, ఏంటిసెప్టిక్ క్రీమ్స్, వేడర్స్, ఇన్సెక్ట్ రేపెల్లెంట్, విండ్ చీటర్, గ్లోవ్స్ మరియు సన్ టాన్స్. జిమ్ కార్బెట్ తన పుస్తకం ' మాన్ ఈటర్స్ ఆఫ్ కుమోన్' లో తయారయి మహసీర్ ఫిషింగ్ కి వెళ్లినట్టు పర్యాటకులు వెళ్ళడం సురక్షితం. పర్యాటకులు ముందస్తు అనుమతిని పొంది రాంగంగా, కోసి, మండల్ మరియు కోత్రి నదులలో ఫిషింగ్ చేసుకోవచ్చు. ఫిషింగ్ రాడ్లు ఇక్కడ రోజుకి అయిదు వందల రూపాయలకు అద్దెకు లభిస్తాయి.