Search
  • Follow NativePlanet
Share
» »తిరుమ‌ల ఆల‌యంలో ఈనెల 16న వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం సంద‌ర్బంగా భ‌క్తుల‌కు కానుక‌లు..

తిరుమ‌ల ఆల‌యంలో ఈనెల 16న వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం సంద‌ర్బంగా భ‌క్తుల‌కు కానుక‌లు..

తిరుమ‌ల ఆల‌యానికి వెళ్లే భ‌క్తుల‌కు శుభ‌వార్త‌... తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ శుక్రవారం వరలక్ష్ష్మీ వ్రతం సంద‌ర్భంగా పూజ కార్య‌క్రమాలు వైభవంగా చేయ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్న‌ట్లు టీటీడీ పేర్కొంది. ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న‌ట్లు తెలిపింది. వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తానికి సంబంధించిన వ‌ర్చువ‌ల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటును భ‌క్తుల‌కు అందించింది. ఇక‌, ఆగ‌స్టు 16న వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం సంద‌ర్భంగా
తెల్లవారుజాము నుంచే పూజ కార్య‌క్ర‌మాలు ప్రారంభం కానున్నాయి. మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేక కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

ప్ర‌త్యేక పూజ‌లు..

వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం సంద‌ర్భంగా ఆల‌యంలో తెల్లవారుజామున ఉదయం 10 గంట‌ల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో కార్య‌క్ర‌మాలు వైభవంగా జరుగనున్నాయి. వ‌ర‌ల‌క్ష్మి వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న దంప‌తుల‌కు అధికారులు కానుక‌లు స‌మ‌ర్పించనున్నారు. వ్ర‌తంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, వడ బహుమానంగా అంద‌జేయ‌నున్నారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు అమ్మ‌వారి ఊరేగింపు కార్య‌క్ర‌మం ఉంటుంది. అమ్మవారి విగ్ర‌హం స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

Varalakshmi Vrat on 16th of this month in Tirumala temple

ప‌లు సేవ‌లు ర‌ద్దు..

వర‌ల‌క్ష్మి వ్రతం కారణంగా తిరుచూనూరు అమ్మవారి ఆలయంలో ప‌లు సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు. అందులో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకరణ సేవలను ఆల‌య అధికారులు ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు. అమ్మ‌వారి ఆల‌యంలో జ‌రిపించే చేసే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు కానుక‌లు అంద‌జేస్తారు. వ్ర‌తం చేసేవారు ప్ర‌త్యేకంగా కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. వ్రతం చేసే వారు ఆ రోజు తెల్ల‌వారుజామునే లేచి మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. ఆలయంలో అర్చకులు ఒక మంట‌పాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో కొలువై ఉన్న వ‌ర‌ల‌క్ష్మి దేవి ద‌ర్శ‌నం చేసుకోవాలి.

అనంత‌రం అదే మంట‌పంలో ముగ్గుల‌తో క‌మ‌లాన్ని ఏర్పాటు చేస్తారు. దాని మధ్యలో కలశాన్ని ఉంచాలి. క‌ల‌శంపై నారికేళ ఫలాన్ని పెట్టాలి. దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ క‌ల‌శాన్ని ఆభ‌ర‌ణాల‌తో ఆలంక‌రిస్తారు. వ‌ర‌లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. రక్ష కట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని సుసంపన్నం చేస్తారు ఆ త‌ర్వాత వ్రతమహత్యం కథను చక్కగా వ‌ర్ణిస్తారు.

వ‌ర్చువ‌ల్ టిక్కెట్లు..

శ్రావణ మాసం పురస్కరించుకుని తిరుమ‌ల‌లోని తిరుచానూరు ప‌ద్మావ‌తి ఆల‌యంలో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు ఘనంగా నిర్వ‌హించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్రతంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న దంపతులకు పలు కానుకలు అందజేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ వ్ర‌తానికి సంబంధించిన వ‌ర్చువ‌ల్ టిక్కెట్ల కోటాను కూడా అధికారులు విడుద‌ల చేయ‌నున్నారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+