హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న మణిమహేష్‌కు ప్రయాణం ప్రారంభమైంది. ఈ యాత్ర హిమాచల్ ప్రదేశ్‌లో జన్మాష్టమికి మొదలై రాధాష్టమికి ముగిస్తుంది. అందుకే ఈ యాత్రను మణిమహేష్ యాత్ర అని పిలుస్తుంటారు. దేశంలోని ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు అటు ప్రకృతి ప్రేమికులు, ఇటు సాహస ప్రియులు ఎంతోగానో ఎదురుచూస్తుంటారు. అంతేకాదు, విహారయాత్రలు చేయాలనుకునేవారికి, ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టేవారికి హిమాచల్‌ప్రదేశ్ ఓ ప్రసిద్ధిచెందిన ప్రదేశంగా నిలిచింది. ఇక ఇక్కడ ప్రారంభమైన మణిమహేష్ యాత్ర విశేషాలు ఇప్పడు తెలుసుకుందాం.
మణిమహేష్ యాత్ర...
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రసిద్ధ మణిమహేష్ యాత్ర ప్రారంభమైంది. జన్మాష్టమి నుండి రాధా అష్టమి వరకు సాగే ఈ యాత్రకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఆగస్టు 26 నుండి ప్రారంభమైన మణిమహేష్ యాత్ర సెప్టెంబర్ 11వ తేదితో ముగుస్తుంది. ఈ యాత్రకు వచ్చిన వారు తప్పకుండా మణిమహేష్ సరస్సును సందర్శించవచ్చు. సెప్టెంబర్ 11వ తేది వరకు మణిమహేష్ సరస్సును సందర్శించవచ్చు. కైలాస శిఖరంపై ఉన్న మహాశివుడు ఈ సమయంలో భక్తులకు దర్శనమిస్తాడని, దాల్ సరస్సునుంచి మహాశివుడు అద్భుతంగా కనిపిస్తాడని ఇక్కడివారు చెబుతుంటారు. మణిమహేష్ యాత్ర ప్రతియేటా సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఉంటుంది.
ఈ యాత్ర జన్మాష్టమి నుంచి ప్రారంభమవుతుంది. తొమ్మదివ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మన్ ఇక్కడే మహాశివుని దర్శనం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 11 రాధాష్టమితో ఈ మణిమహేష్ యాత్ర ముగుస్తుంది. కానీ, ఈ యాత్ర చేయడం అంత సులభం కాదు. మంచు పర్వతాల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు ముందుగా అధికారులు అనేక మార్గదర్శకాలను జారీ చేస్తారు. వాటిని అనుసరించడం తప్పనిసరి.

ఢిల్లీ, చుట్టుపక్కల నివసించే ప్రజలకు హిమాచల్ ప్రదేశ్ ఓ వీకెండ్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. మీ వారంతపు సెలవుల్లో తప్పకుండా ఈ యాత్రకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు. వర్షాకాలం మినహా ఎప్పుడైనా ఇక్కడకు రావొచ్చు. కానీ జన్మాష్టమి నుండి రాధా అష్టమి వరకు మణిమహేష్ సరస్సు సందర్శించేందుకు ఉత్తమ సమయం అని ఇక్కడివారు చెబుతున్నారు.
మణిమహేషుని నివాసం..
ఈ సరస్సు నుండి మణిమహేష్ కైలాస శిఖరం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కైలాస శిఖరంపై కొలువైఉన్న మహాశివుడు కూడా ఎంతో స్పష్టంగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. మణిమహేష్ యాత్ర ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లోనే ప్రారంభమవుతుంది.
ఈ మతపరమైన తీర్థయాత్రలో, కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్న రాజ స్నానం అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది రాధా అష్టమి అంటే సెప్టెంబర్ 11వరకు నిర్వహిస్తారు.

భక్తులకు ముఖ్యమైన చిట్కాలు..
ఈ యాత్రలో పాల్గొనే భక్తులు తమ వైద్య ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఈ యాత్ర చేసేటప్పడు నిదానంగా సాగాలి, ఊపిరి ఆడకుండా ఉంటే, ఆగి విశ్రాంతి తీసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది.
యాత్రకు వెళ్లే భక్తులకు గొడుగు, వెచ్చని బట్టలు, దృఢమైన బూట్లు, టార్చ్, కర్రను తప్పక తమ వెంట తీసుకెళ్లాలి.
ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు గనుక వస్తే.. సమీపంలోని శిబిరాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అరుదైన మూలికలు, మొక్కలను తాకవద్దు. ఈ యాత్రకు వెళ్లేటప్పడు మీ గుర్తింపు కార్డులలో కొన్నింటిని మీతోపాటు తీసుకెళ్లాలి.
ఈ యాత్ర చేసేవారు ఉదయం 4 గంటలకు ముందు, సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాణం చేయకూడదు.



Click it and Unblock the Notifications












