Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ పర్యటన - ఒక పరిశీలన

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత దేశం లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ ఆదాయానికి ఈ రంగం నుండి అధిక భాగం లభిస్తోంది. టూరిజం రంగం లోని ఈ అభివృద్ధి హిమాచల్ ప్రదేశ్ లో అనేక హోటళ్ళ మరియు రిసార్ట్ ల స్థాపనకు దోహదం చేసింది. పర్యాటకులకు మరింత ఆనందం మరియు చక్కని అనుభూతులను పంచుతోంది.

భౌగోళికంగా పరిశీలిస్తే, ఈ రాష్ట్రం తూర్పు వైపు టిబెట్, పడమటి వైపు పంజాబ్, మరియు జమ్మూ & కాశ్మీర్ ఉత్తరం వైపు సరిహద్దులు గా కలిగి వుంది. దేవ భూమి లేదా దేవుళ్ళ భూమి గా చెప్పాబడే హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులకు దాని లోని దట్టమైన పచ్చటి లోయలు, మంచు శిఖరాలు, మంచు కొండలు, అందమైన సరస్సులు, పచ్చని పచ్చిక మైదానాలతో ఒక స్వర్గాన్ని తలపిస్తుంది.

వాతావరణం

ప్రధానంగా, హిమాచల ప్రదేశ్ లో సంవత్సరం లో మూడు కాలాలు కలవు. అవి వసంత కాలం, శీతాకాలం మరియు వర్షాకాలం . వసంత కాలం ఫిబ్రవరి లో మొదలై ఏప్రిల్ మధ్య భాగం వరకూ వుంటుంది. శీతాకాలం అక్టోబర్ లో మొదలై, మార్చ్ చివర వరకూ వుండి సరైన పర్యటనకు అవకాశం కల్పిస్తుంది.

భాష

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో హిందీ అధికార భాష గా వుంటుంది. ఇంకా అనేక భాషలు కూడా ఉన్నప్పటికీ పహారీ భాష విస్తృతంగా వాడుకలో కలదు. ఈ భాషకు సంబంధించిన ఇతర మాండలిక భాషలు మందియాలి, కులవి, కేహ్లూరి, హిందూరి, చమేలి, సిర్మురి, మిఆహాస్వి, పంగ్వాలి భాషలను మంది, కులు, బిలాస్పూర్, నలాగర్, చంబా, సిర్మౌర్, మహాసు, మరియు పంగి ప్రదేశాలలో మాట్లాడతారు. మరికొన్ని మాండలిక భాషలైన కిన్నౌరి, లాహౌళి, మరియు భొట్ స్పితియాన్ వంటి భాషలు కూడా కలవు. పహారీ మాండలిక భాషలు అన్నీ కూడా సంస్కృతం నుండి పుట్టినవె. పంజాబీ, డోగ్రి మరియు కాంగ్రి లు కూడా రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల లో మాట్లాడతారు. అయితే, రాష్ట్రం లోని పడమటి భాగాలు గుజరాతి భాషలను మాట్లాడతారు. మొగలుల కాలంలో ఈ భాషలకు పర్షియా లిపి ఉన్నప్పటికీ, ప్రస్తుతం దేవనాగిరి లిపి వాడుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో పర్యటన

హిమాచల్ ప్రదేశ్ లోని 12 జిల్లాలలోని ప్రతి జిల్లాలోను అనేక ఆకర్షణా ప్రాంతాలు కలవు. సైట్ సీఇంగ్, మతపర ప్రదేశాలు, ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్, పారా గ్లైడింగ్, ఐస్ స్కేటింగ్, గోల్ఫ్ వంటివి ఎన్నో కలవు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఈ జిల్లాలను నాలుగు సర్కిల్స్ గా విభజించినది. అవి సట్లేజ్ , బియాస్ , దౌలాధస్ర్ మరియు ట్రైబల్ సర్కిల్స్. బియాస్ నది ప్రఖ్యాత మనాలి, కులు వాలీ ల గుండా ప్రవహిస్తుంది. ఈ సర్కిల్ పర్యాటకులకు దేవదారు అడవులు, పైన్ చెట్లు, ఆల్పైన్ పొలాలు, పర్వత వాలులు, పచ్చటి మైదానాలు , పూవుల తోటలు, పండ్ల తోటలు మొదలైనవి చూపుతుంది. గిరిజనుల వలయ ప్రదేశాలలో, మంచు కొండలు, మంచుతో గడ్డకట్టిన సరస్సులు, కనుమలు, అందమైన ఆరామాలు, లామాలు, జడల బర్రెలు కనపడతాయి. గొప్ప సాంప్రదాయక విలువలతో కూడిన ఈ ప్రదేశం అతి గొప్ప సాహస క్రీడలకు ప్రసిద్ధి.

హిమాలయాల వెలుపలి భాగంగా చెప్పబడే ధౌళాధర్ సర్క్యూట్ డల్హౌసీ తో మొదలై బద్రినాథ్ తో ముగుస్తుంది. ఈ సర్క్యూట్ కాంగ్రా వాలీ నుండి బాగా కనబడుతుంది. సట్లేజ్ సర్క్యూట్ శివాలిక్ పర్వతాల దిగువ భాగ కొండలను చూపుతుంది. ఈ సర్క్యూట్ లో అందమైన పచ్చని ఆపిల్ తోటలు, పైన్ మరియు దేవదార్ అడవులు , సట్లేజ్ నది వంటివి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి.

'దేవతల నివాసం ' గా చెప్పబడే ఈ రాష్ట్రం లో అనేక హిందూ దేవాలయాలు కలవు. జ్వాలాముఖి, చాముండా, వజ్రేశ్వరి, చిన్తపుర్ని, వైద్యనాధ్, లక్ష్మినారయన్, చౌరాసి దేవాలయాలు వాటిలో కొన్ని. అనేక గురుద్వారాలు మరియు చర్చి లు కూడా రాష్ట్రం లోని వివిధ భాగాల లో కలవు. పవొంతా సాహిబ్, రేవల్సార్ మరియు మనికారాన్ ప్రదేశాలు ప్రధాన సిక్కుల మత కేంద్రాలు. క్రిస్ట్ చర్చి కసౌలి, క్రిస్ట్ చర్చి సిమ్లా మరియు సైట్ జాన్స్ చర్చి వంటివి ప్రధాన క్రైస్తవ మత చర్చి లు.

ప్రకృతి ప్రేమికులకు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వాలీ నేషనల్ పార్క్, రేణుక సంక్చురి , పాంగ్ డం సంక్చురి, గోపాల్పూర్ జూ, కుఫ్రి వంటివి ప్రసిద్ధ ప్రదేశాలు. కాంగ్రా ఫోర్ట్, జుబ్బల్ పాలస్, నగ్గర్ కేజల్, కమరు ఫోర్ట్, గోండ్లా ఫోర్ట్, క్రిస్ట్ చర్చి, చాప్స్లీ, వుడ్ విల్లా పాలస్, చైల్ పాలస్ వంటి ప్రదేశాల లో రాచరిక వైభవం చూడవచ్చు.

పురాతన రాజుల కాలం నాటి చరిత్రకు సంబంధించిన అనేక మ్యూజియం లు మరియు గేలరీ లు కూడా కలవు. వాటిలో స్టేట్ మ్యూజియం, కాంగ్రా ఆర్ట్ గేలరీ, భూరి సింగ్ మ్యూజియం, రోరిచ్ ఆర్ట్ గేలరీ మరియు శోభా సింగ్ ఆర్ట్ గేలరీ లు ప్రధానమైనవి. ప్రశాంతం గా సమయం గడపాలనుకునే వారికి అందమైన అనేక సరస్సులు కలవు. వాటిలో ప్రశార్ లేక్, ఖజ్జాయర్ లేక్, రేణుక లేక్, గోవింద్ సాగర్ లేక్, దళ్ లేక్, పాంగ్ డాం లేక్, పండో లేక్, మని మహేష్ లేక్ మరియు బ్రిఘు లేక్ వంటివి కొన్ని.

హిమాచల్ ప్రదేశ్ అనేక ఉత్సవ వేడుకలు కు కూడా ప్రసిద్ధి చెందినది. ప్రతి ఏటా వింటర్ కార్నివాల్ శివరాత్రి, లాదర్చా ఫెయిర్, మిన్జార్ ఫెయిర్, మని మహేష్ ఫెయిర్, ఫులేచ్, కులు దసరా లావి ఫెయిర్, రేణుక ఫెయిర్ , ఐస్ స్కేటింగ్ కార్నివాల్, వంటివి ప్రసిద్ధి. బీర్, మనాలి, బిలాస్పూర్, రోహ్రు వంటి ప్రదేశాలు పర్యాటకులు అభిలషించే సాహస క్రీడలైన ఏరో క్రీడలు...పారా గ్లైడింగ్ మరియు హాంగ్ గ్లైడింగ్ లకు ప్రసిద్ధి.

 

 

 

 

హిమాచల్ ప్రదేశ్ ప్రదేశములు

  • గుషైని 7
  • స్పితి 18
  • లాహుల్ 11
  • కోట్ ఖాయి 9
  • నదౌన్ 8
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri