పిన్ వాలీ నేషనల్ పార్క్, కులు

హోమ్ » ప్రదేశములు » కులు » ఆకర్షణలు » పిన్ వాలీ నేషనల్ పార్క్

హిమాచల్ ప్రదేశ్ లోని చల్లటి ఎడారి ప్రాంతంలో స్పితి లోయలో ఉన్న ఒకేఒక్క నేషనల్ పార్కు పిన్ వాలీ. 675 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ పార్కును 1987 లో కనుగొన్నారు.

షుమారు 20 జాతుల జంతువులు, పక్షులకు నిలయమైన ఈ పార్కు అంతరించిపోతున్న మంచు చిరుతల సంరక్షణకు పేరుగాంచింది. పైకా, భరల్, చుకోర్, వీసల్, గోల్డెన్ ఈగల్, ఐబెక్స్, హిమాలయన్ చౌ, మార్టెన్, రెడ్ ఫాక్స్, స్నో కోక్, గ్రిఫాన్, బేర్దేడ్ వల్చర్, రావెన్ వంటివి ఇక్కడ సాధారణంగా కనపడే జంతువులలో కొన్ని.

పిన్ వాలీ లో మూలికలు, సుగంధ ద్రవ్యాలతో పాటు షుమారు 400 రకాల వృక్ష సంపద ఉంది. ఇక్కడ కనపడే మొక్కలలో ఔషధ గుణాలు ఉండడం వలన వీటిని మందుల తయారీలో ఉపయోగించవచ్చు. పర్యాటకులు ఈ పార్కులో ప్రవేశించడానికి పిన్ వాలీ డైరెక్టర్ అనుమతి తీసుకొనవలసి ఉంటుంది.

Please Wait while comments are loading...