Search
  • Follow NativePlanet
Share

రుఖల - రుచికర ఆపిల్స్ తోటలు  !

12

రుఖల, హిమాచల్ ప్రదేశ్ లోని కోట్ ఖై బెల్ట్ మధ్యలో, వేగంగా ప్రాముఖ్య౦ పెరుగుతున్న ఒక పర్యాటక గమ్యస్థానం. ఈ ప్రాంతం సుందరమైన దృశ్యాలు, రుచికరమైన ఆపిల్స్ కి, ఆతిధ్యానికి ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలోని ఇతర ఆకర్షణలు వారసత్వ గ్రామాలుగా మార్చబడిన గ్రామాలు.

డిసెంబర్, జనవరి నెలలలో ఆపిల్, రేగు పళ్ళ తోటలు గులాబీ, పచ్చ పళ్ళతో నిండి ఫాం హౌస్ లతో నిండిన పల్లె భూభాగాలతో వర్ణ రంజితమౌతుంది. రుఖల ప్రపంచవ్యాప్తంగా రాయల్, గోల్డెన్, గ్రాన్నీ స్మిత్ ఆపిళ్ళ ఉత్పత్తికి, ఎగుమతి కి ప్రసిద్ది చెందింది.

పచ్చటి తోటలతో బాటు, రుఖలలో ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. కియరి దేవాలయం, దియోరి దేవాలయం, రుఖలలో అటువంటి చెప్పుకోదగిన అనేక ఆకర్షణలలో కొన్ని. ఈ రెండు దేవాలయాలను పచ్చటి అటవీ సంపద, గ్రామీణ ఫాం హౌస్ ల మధ్యనుండి కొండలపై నడచి చేరవచ్చు. కియరి దేవాలయం, సృజనాత్మక స్త్రీశక్తి స్వరూపిణి దుర్గ దేవికి చెందిన 300 ఏళ్ళ నాటి కట్టడం.

రుఖల నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చంబి-కుప్పర్ ప్రాంతానికి పర్యాటకులు విహారయాత్రలు కూడా చేయవచ్చు.

రుఖల, విమాన, రైలు, రోడ్డు వంటి అన్ని ప్రధాన రవాణా మార్గాల చక్కటి అనుసంధానాన్ని కల్గి ఉంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం రుఖలలో ప్రధాన కాలాలు. ఈ ప్రా౦తం చుట్టపక్కల చూడదలచిన పర్యాటకులు ఈ ప్రాంతాన్ని మేలో మొదలై జూలై వరకు ఉండే వేసవిలో సందర్శించవచ్చు. అయితే, శీతాకాలంలో వాతావరణం ఆహ్లాదకర౦గా ఉండటం వలన ఈ కాలంలో పర్యటన కూడా సిఫార్సు చేయబడింది.

రుఖల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రుఖల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రుఖల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రుఖల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా: రుఖల పర్యటించాలని ప్రణాళిక ఉన్న పర్యాటకులు ఈ ప్రాంతాన్ని బస్సుల ద్వారా కూడా చేరవచ్చు. షిమ్లా, రుఖల నుండి కేవలం 2.9 కిలోమీటర్ల దూరంలో ఉంది, దీనిని బస్సు ద్వారా చేరవచ్చు. షిమ్లా, ఇతర పట్టణాలతో బాటుగా డల్ హౌసి, లక్నో, శ్రీనగర్, చండీఘడ్, చంబ, మనాలి, కుల్లు, జుబ్బల్ వంటి వాటితో చక్కగా కలప బడింది. డెహ్రాడూన్, న్యూ ఢిల్లీ, కసౌలి నుండి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. చండీగఢ్ నుండి రుఖలకు ఏ.సి. వోల్వో బస్సులు చార్జీలు ఒక్కొకరికి 1025 రూపాయలతో తరుచుగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా: కల్క రైలు స్టేషన్, కల్క- షిమ్లా లైన్ లోని రుఖలకు అతి దగ్గరి రైల్వే మార్గం. షిమ్లా, ధరంపూర్, సోలన్, కందఘాట్, సాలోగ్ర, బరోగ్ వంటి పరిసర పట్టణాలు రుఖలకు ఈ రైలు మార్గం ద్వారా చక్కగా కలప బడ్డాయి. కల్క నుండి రుఖలకు మొదటి తరగతి సీట్లకు రైలు చార్జీ 100 నుండి 220 రూపాయల వరకు ఉంటుంది. షిమ్లా నుండి రుఖలకు కిలోమీటర్ కు 7 రూపాయల చొప్పున టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    రుఖలను విమాన, రైలు, రోడ్డు వంటి ప్రధాన రవాణా మార్గాల ద్వారా సులువుగా చేరవచ్చు. విమనామార్గం ద్వారా: భుంటర్ విమానాశ్రయం రుఖలకు 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి దగ్గరి విమానాశ్రయం. గగ్గల్ విమానాశ్రయం, రుఖల నుండి 103 కిలోమీటర్ల దూరంలో గమ్యస్థానం చేరడానికి ఉన్న మరొక ప్రత్యామ్నాయ౦. ఈ విమానాశ్రయాలు ఢిల్లీ, ముంబై, ధర్మశాల వంటి ప్రధాన నగరాలతో బాటుగా ఇతర ప్రాంతాలకు చక్కటి అనుసంధానాన్ని కల్గి ఉన్నాయి. ఈ విమానాశ్రయాల నుండి రుఖలకు టాక్సీ, క్యాబ్ సేవలు సరసమైన ధరలలో అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri