Search
  • Follow NativePlanet
Share
» »ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. అమ‌రావ‌తి కేంద్రంగా ఢిల్లీకి మ‌రో విమాన స‌ర్వీసు!

ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. అమ‌రావ‌తి కేంద్రంగా ఢిల్లీకి మ‌రో విమాన స‌ర్వీసు!

ఏపీ నుంచి కేంద్ర మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పారు. విజ‌య‌వాడ నుంచి ఢిల్లీకి విమాన స‌ర్వీసును తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించారు. దేశ రాజధాని ఢిల్లీతో విజయవాడకు కనెక్టివిటీ పెంచేందుకు ఈ కొత్త విమాన సర్వీసును తీసుకువ‌స్తున్న‌ట్లు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ స‌ర్వీసు అందుబాటులోకి వ‌స్తే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి హ‌స్తిన‌కు విమాన స‌ర్వీసులు న‌డిస్తే.. అది రాష్ట్రానికి ఆర్థికంగా కూడా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని కేంద్రం అభిప్రాయ‌ప‌డుతోంది. ఈ విమాన సర్వీసులు సెప్టెంబర్ 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఏపీ ప్ర‌జ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమ‌రావ‌తి కేంద్రంగా విజయవాడ నుంచి దేశ రాజ‌ధాని ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు రాబోతోంది. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం, అమరావతికి ప్రాధాన్యం కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయనే చెప్పాలి. ఇప్ప‌టికే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అందులో భాగంగా విజయవాడ ఇంటర్నేషనల్ టెర్మినల్‌ నిర్మాణాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మ‌రో విమాన స‌ర్వీసును విజయవాడ నుంచి ఢిల్లీకి తీసుకొస్తున్న‌ట్లు రామ్మోహ‌న్ నాయుడు వెల్ల‌డించారు. వ‌చ్చే నెల‌ సెప్టెంబర్‌ నుంచి కొత్తగా ఈ విమాన సర్వీసు అందుబాటులోకి రానుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఆ స‌ర్వీసుల‌కు మంచి ఆధ‌ర‌ణ‌..

విజయవాడ-ఢిల్లీ మధ్య ప్రస్తుతం ఉదయం, సాయంత్రం రెండు సర్వీసులు నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ‌ ఎయిర్ ఇండియా సర్వీసుల‌ను 2014లో మొద‌లుపెట్టారు. అంతేకాదు, ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత విజయవాడను కేంద్రంగా చేసుకుని కొత్త రాజధాని కార్యకలాపాలు సాగాయి. దీంతో మొదట్లో ఉదయం పూట మాత్రమే ఒక సర్వీసును నడిపించారు. అనంత‌రం స్థానిక నేత‌ల అభ్య‌ర్థ‌న మేర‌కు సాయంత్రం కూడా మరో సర్వీసును కొన‌సాగించారు. ఈ రెండు స‌ర్వీసుల కార‌ణంగా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లి గంట‌ల వ్య‌వ‌ధిలో ప‌నులు చూసుకువ‌చ్చేలా విమాన స‌మ‌యాల‌ను ఫిక్స్ చేశారు.

90 శాతం వ‌ర‌కూ ఆక్యుపెన్సీతో ఈ విమాన స‌ర్వీసుల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అయితే, ఇటీవ‌ల కాలంలో విమాన ప్ర‌యాణం సాధార‌ణం అవ్వ‌డంతోపాటు ఈ స‌ర్వీసులుకు ర‌ద్దీ పెర‌గ‌డంతో టికెట్లు కూడా దొరికే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో మ‌రో స‌ర్వీసును తీసుకురావాల్సిందిగా ప్రయాణికుల నుంచి విజ్ఙ‌ప్తులు పెరిగాయి. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు కొత్త స‌ర్వీసును తీసుకువ‌స్తున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌క‌టించారు.

Another flight service from Amaravati to Delhi

ప‌ర్యాకాభివృద్ధి పెరుగుతుంది..

అంతేకాదు, ప్రస్తుతం ఉదయం 8 తర్వాత మరో సర్వీసు లేదు. దీంతో పగటి పూట మరో విమానాన్ని ఢిల్లీకి నడపాలని ప‌ర్యాట‌కుల‌తోపాటు వ్యాపార వర్గాల నుంచి డిమాండ్ పెరిగింది. పై అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి కొత్త సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ అంగీకరించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. విజయవాడ నుంచి ఉదయం 11.

10 గంటలకు విమానం బయలుదేరి, మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీ చేరుతుందని తెలిపారు. అలాగే, ఢిల్లీ నుంచి ఉదయం 8.10 గంటలకు మ‌రో స‌ర్వీసు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అది విజయవాడకు 10.40 గంటలకు ల్యాండ్ అవుతుంద‌ని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చే విమాన సర్వీసు వల్ల రాజధాని అమరావతి, దిల్లీ మధ్య రాకపోకలు సులభతరం అవుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మ‌రీ ముఖ్యంగా ఈ ప్ర‌క‌ట‌న‌తో ప‌ర్యాటాభివృద్ధి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+